E-Paper
Advertisement

CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేవలం 19 ఏళ్ల కాలంలోనే జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగానని వివరించారు. ఎమ్మెల్యేగా అనేక అనుభవాలు గడించడమే కాకుండా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలకు తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారం.. 

Advertisement

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గళం వినిపించినందునే తనపై అనేక కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. నిన్న కూడా కోర్టుకు హాజరయ్యానని చెబుతూ తనపై పరువు నష్టం దావాలు కూడా వేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారం సాధించామని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే రాహుల్ గాంధీ నేడు దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారని చెప్పారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా రాహుల్ ప్రధాని కావడం చారిత్రక అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ: BR Naidu Allegations: బీఆర్ నాయుడుపై బాధితురాలి సంచలన లేఖ.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు!

Advertisement

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

రాహుల్ గాంధీ సైతం ఈ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. పదవులను ఆశించకుండా పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మహాత్మా గాంధీ నిరాడంబరతను ఎగ్జాంపుల్ గా చూపుతూ బ్రిటిష్ వారే ఆయనను ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకమై పనిచేస్తే అధికారం దానంతట అదే వస్తుందని రాహుల్ భరోసా ఇచ్చారు. జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షులే సుప్రీం అని పేర్కొంటూ వారంతా తన టీమ్‌లో అంతర్భాగమని సీఎం రేవంత్ కొనియాడారు.

ష్టపడి పని చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి..

సిద్దిపేట మాజీ డీసీసీ నర్సారెడ్డి ప్రస్తుత డీసీసీ ఆంక్షా రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలను రాహుల్ గాంధీకి వివరించారు. వారి పోరాట పటిమను అభినందించిన రాహుల్ కష్టపడి పని చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయని ఆకాంక్షించారు. రానున్న రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవేనని అంతా సమిష్టిగా ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.

ALSO READ: Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×