E-Paper
Advertisement

తండ్రి ప్రియురాలు ఎంట్రీ… శవాన్ని పూడ్చే సమయంలో అన్నదమ్ములకు దిమాక్ ఖరాబ్ షాక్

తండ్రి ప్రియురాలు ఎంట్రీ… శవాన్ని పూడ్చే సమయంలో అన్నదమ్ములకు దిమాక్ ఖరాబ్ షాక్
Advertisement

Dark Comedy Drama : హాలీవుడ్‌ డార్క్ కామెడీ మూవీ ఫ్యాన్స్‌కి ఒక అద్భుతమైన గిఫ్ట్ లాంటి చిత్రం ‘రేమండ్ అండ్ రే’. ఇవాన్ మెక్‌గ్రెగర్, ఈథన్ హాక్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తండ్రి-కొడుకుల సంబంధాల గురించి, క్షమాపణ, కొత్త ప్రారంభాల గురించి ఉంటుంది. హాస్యం, ఎమోషన్ కలిపి ఉండే ఈ విలక్షణమైన డ్రామా ఆడియన్స్ ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రేమండ్ (ఇవాన్ మెక్‌గ్రెగర్), రే (ఈథన్ హాక్) ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు. వాళ్ళ తండ్రి హారిస్ చాలా క్రూరమైన వాడు. బాధ్యతలేని ఈ వ్యక్తి తన కుటుంబాన్ని మెంటల్ టార్చర్ పెడతాడు. ఆ హింస భరించలేక ఇద్దరూ చిన్నప్పుడే ఇంటిని వదిలి వెళ్లిపోయి, తండ్రికి పూర్తిగా దూరంగా జీవితం గడుపుతుంటారు. ఒకరోజు వారి తండ్రి చనిపోయాడనే వార్త వస్తుంది. అంత్యక్రియల కోసం వెళ్లిన ఆ అన్నదమ్ములకు తండ్రి రాసిన ఒక వింతైన చివరి కోరిక గురించి తెలుస్తుంది.

Advertisement

తన సమాధిని ఎవరితోనూ తవ్వించకూడదని, తన ఇద్దరు కొడుకులే స్వయంగా చేతులతో తవ్వాలని అతను కండీషన్ పెడతాడు. కన్నతండ్రి కదా… ఎంతకోపం ఉన్నా చివరి కోరిక తీర్చకుండా ఎలా ఉంటారు… కోపంతోనే సమాధి తవ్వడం ప్రారంభిస్తారు. అలాంటి టైమ్ లో ఆ అన్నదమ్ములకు… అక్కడకు వచ్చే తండ్రి పాత స్నేహితులు, ప్రియురాళ్లు, నర్సుల ద్వారా తమ తండ్రి గురించిన సరికొత్త నిజాలు తెలుస్తాయి. ఒకవైపు తండ్రి చేసిన పాత గాయాలు గుర్తు చేసుకుంటూనే, మరోవైపు సమాధి తవ్వుతూ వారు తమ జీవితాలను ఎలా పునర్నిర్మించుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ. మరి ఆ అన్నదమ్ములకు తండ్రి గురించి తెలిసిన షాకింగ్ నిజం ఏంటి ? అసలు ఆ తండ్రి కన్న బిడ్డలని ఎందుకంత టార్చర్ పెట్టాడు ? చివరికి ఇలాంటి కోరిక ఎందుకు కోరాడు ? అనేది తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

కామెడీ, ఎమోషన్, డార్క్ కామెడీ కలగలిపి ఉన్న ఈ చిత్రం తండ్రి-కొడుకుల సంబంధాలను రియలిస్టిక్ గా చూపిస్తుంది. ఇవాన్ మెక్‌గ్రెగర్, ఈథన్ హాక్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆపిల్ ఒరిజినల్ ఫిల్మ్ గా వచ్చిన ‘రేమండ్ అండ్ రే’ ప్రస్తుతం Apple TV+లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేకపోవడం అన్నది నిరాశ కలిగించే విషయం. కానీ భాష సమస్య కాదు అనుకున్న వాళ్ళు ఈ మూవీని ఇంగ్షీషులో చూడవచ్చు.

Advertisement

Read Also : ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు.. నెట్‌ఫ్లిక్స్‌ను రూల్ చేస్తోన్న నెంబర్ 1 సిరీస్ ఇదే!

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×