E-Paper
Advertisement

Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి కోసం ఖర్చు ఎంతో తెలుసా? ఎంతైనా నేషనల్ క్రష్ కదా?

Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి కోసం ఖర్చు ఎంతో తెలుసా? ఎంతైనా నేషనల్ క్రష్ కదా?
Advertisement

Vijay Rashmika wedding:  టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే నేషనల్ రష్మిక మందన్నతో కలిసి ఏడడుగులు నడవబోతున్న సంగతి తెలిసిందే .గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక వీరీ పెళ్లి వేడుక ఉదయపూర్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే అయితే ఉదయపూర్ లో కేవలం పెళ్లి కోసమే ఈ దంపతులు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఉదయపూర్ లోని ఆరావలి పర్వత ప్రాంతంలో అద్భుతమైన రిసార్ట్ లో రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుక..

ఈ రిసార్ట్ కోసం రోజుకు రెండు కోట్ల రూపాయల రెంట్ చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఈ జంట రిసార్ట్ కోసమే 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు .ఇలా ఈ రిసార్ట్ లో 117 సూట్లు, విల్లాలు, అలాగే హెలి ప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఈ జంట కేవలం రిసార్ట్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి ఖర్చులు, రిసెప్షన్ కోసం మరింత ఖర్చు చేయబోతున్నారని తెలుస్తుంది.

రిసార్ట్ కోసమే రూ.6 కోట్లు…

Advertisement

పెళ్లి రిసార్ట్ కోసమే 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని విషయం తెలిసినా అభిమానులు షాక్ అవుతున్నారు ఎంతైనా నేషనల్ క్రష్ కదా తన పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ వేడుకను విజయ్ రష్మిక వారికి నచ్చినట్టుగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను జరుపుకోబోతున్నారు.

సినిమాలకు విరామం..

Advertisement

ఈ పెళ్లి వేడుకలో భాగంగా కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వివాహ రిసెప్షన్ మాత్రం టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల సమక్షంలో హైదరాబాదులో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఫిబ్రవరి 26న ఈ దంపతుల పెళ్లి బంధంతో ఒకటి కాగా, మార్చి 4న వీరి రిసెప్షన్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి వేడుకలలో భాగంగా ఈ జంట కమిట్ అయిన సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

Also Read: Naa Anvesh: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కు షాక్ ఇచ్చిన ఇంస్టాగ్రామ్…

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×