E-Paper
Advertisement

Production of Electricity : రాళ్ల నుండి కరెంటు తయారీ.. థర్మల్ పద్ధతిలో..

Production of Electricity : రాళ్ల నుండి కరెంటు తయారీ.. థర్మల్ పద్ధతిలో..
Advertisement
Production of Electricity

Production of Electricity : ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా వారి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యాల మధ్య వారి అవసరాలను తీర్చడం చాలా కష్టంగా మారుతోంది. అలాంటి అవసరాల్లో ఒకటి కరెంటు. ఇప్పటికే మనుషుల అవసరాలకు తగిన కరెంటు వారికి అందడం లేదని నిపుణులు అంటున్నారు. అందుకే సోలార్ లాంటి మార్గాల్లో కూడా కరెంటును క్రియేట్ మొదలయ్యింది. తాజాగా మరో కొత్త పద్ధతిలో కూడా కరెంటు క్రియేట్ అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

Advertisement

తరువాతి తరాలకు కరెంటు అవసరాలను తీర్చాలంటే ఈ సోలార్ పవర్ కూడా సరిపోదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే కొత్త పద్ధతుల్లో కరెంటును తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పాటుపడుతున్నారు. తాజాగా రాళ్లు ఉంటే చాలు.. కరెంటును తయారు చేయవచ్చు అని కొత్త టెక్నిక్‌ను వారు కనిపెట్టారు. సూర్యుడి నుండి వచ్చే వెలుగు ద్వారా రాళ్ల సాయంతో ఎలాగైతే ఆహార పదార్థాలను ఎండబెడతారో.. అదే విధంగా కరెంటును కూడా తయారు చేయవచ్చని వారు చెప్తున్నారు. ఆఫ్రికా శాస్త్రవేత్తలు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

టాంజానియాలో ఉండే పలు సోప్‌స్టోన్స్, గ్రానైట్ శాంపుల్స్‌ను పరీక్షించి చూసినప్పుడు ఇవి సూర్యుడి నుండి వచ్చే వేడిని స్టోర్ చేయగలవని తేలింది. ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా వేడిని స్టోర్ చేసి ఉంచగలవని శాస్త్రవేత్తలు గమనించారు. మామూలుగా కరెంటు ఎక్కువగా అవసరం ఉన్న సమయాల్లో బ్యాటరీల్లో స్టోర్ చేసి ఉంచుతారు. కానీ ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా తయారు చేయడానికి కూడా ఎన్నో వనరులతో పాటు చాలా సమయం పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న పద్ధతే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. అంటే ఈ పద్ధతిలో నీరు, నూనె లేదా రాళ్లు లాంటి వాటిలో ఎనర్జీని స్టోర్ చేయవచ్చు.

Advertisement

రాళ్లలో సూర్యుడి వేడిని స్టోర్ చేసుకున్న తర్వాత దానిని కరెంటుగా మార్చవచ్చు. గ్రానైట్, సోప్‌స్టోన్స్ లాంటి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో కనిపిస్తాయి. అందుకే ఇవి ఎక్కువగా థెర్మల్ ఎనర్జీ స్టోరేజ్‌కు వనరుల్లాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే ఈ రాళ్లు ఏ ప్రదేశంలో దొరుకుతున్నాయి అనేదాన్ని బట్టి వాటి ప్రాపర్టీస్‌లో మార్పులు వస్తాయి. ముందుగా వీటిలో ఉండే తేడాలు కనుక్కున్న తర్వాత ఎనర్జీ స్టోరేజ్ విషయంలో ప్రయోగాలు వేగవంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో సక్సెస్‌ఫుల్ అయితే సోలార్ లాగా థెర్మల్ ఎనర్జీ కూడా మనుషుల కరెంటు అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×