E-Paper
Advertisement

Antibiotics : ఫ్రూట్ ఫ్లైలోని శక్తితో యాంటీబయాటిక్స్ తయారీ..

Antibiotics : ఫ్రూట్ ఫ్లైలోని శక్తితో యాంటీబయాటిక్స్ తయారీ..
Advertisement
Antibiotics

Antibiotics : యాంటీబయాటిక్స్ అనేవి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఈరోజుల్లో చాలామంది వైద్యులు.. చాలావరకు ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్‌నే ఉపయోగించమని సలహా ఇస్తున్నారు. అందుకే కొత్త రకమైన యాంటీబయాటిక్స్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్రూట్ ఫ్లై అనే పురుగులో ఉండే పెప్టైడ్ నుండి కూడా యాంటీబయాటిక్స్‌ను తయారు చేయవచ్చని వారు గుర్తించారు.

Advertisement

ఫ్రూట్ ఫ్లై నుండి దొరికే పెప్టైడ్ అనేది నేచురల్‌గా ఉంటుంది కాబట్టి.. దాని నుండి నేచురల్‌గా యాంటీబయాటిక్‌ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పెప్టైడ్‌ను డ్రోసోకిన్ అంటారని వారు తెలిపారు. ఈ పెప్టైడ్ అనేది ఫ్రూట్ ఫ్లైను ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుందని, అదే సామర్థ్యాన్ని మనుషులకు ఇస్తే.. వారు కూడా ఇన్ఫెక్షన్స్‌కు దూరంగా అవకాశం ఉంటుందనే ఆలోచనతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రొటీన్స్‌ను తయారు చేసుకొని తనను తాను కాపాడుకోవడంలో ఫ్రూట్ ఫ్లై ముందుంటుంది అన్నారు.

డ్రోసోకిన్ లాంటి పెప్టైడ్.. యాంటీబయాటిక్‌గా ఉపయోగించాలని అనుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. తేనెటీగల్లో కూడా అపిడేసిన్ అనే పెప్టైడ్ ఉంటుందని, దానిని కూడా ఇంతకు ముందు యాంటీబయాటిక్‌గా మార్చడానికి ప్రయత్నించామని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు.. వందలకొద్దీ ఫ్రూట్ ఫ్లైలను సేకరించారు. వాటి జాతికి చెందిన ఇతర పురుగులను కూడా వారు సేకరించి, అందులో నుండి పెప్టైడ్స్‌ను బయటికి తీశారు.

Advertisement

డ్రోసోకిన్ అనేది బ్యాక్టీరియాలో చేరి, దానిని నాశనం చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తేనెటీగల్లో నుండి తీసిన అపిడేసిన్ పెప్టైడ్, ఫ్రూట్ ఫ్లై నుండి తీసిన డ్రోసోకిన్ పెప్టైడ్ అనేది.. రెండూ ఒకే విధమైన యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయని వారు తెలిపారు. రెండూ ఒకే విధంగా బ్యాక్టీరియాలోకి చేరి, దానిని నాశనం చేస్తాయన్నారు. ఈ పెప్టైడ్స్ ఎలా పనిచేస్తాయి అని మరిన్ని పరిశోధనలు చేసి, తెలుసుకొని.. దీని ద్వారా మరిన్ని యాంటీబయాటిక్స్ తయారీకి ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×