E-Paper
Advertisement

Porsche: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో పార్ష్ కీలక నిర్ణయం..

Porsche: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో పార్ష్ కీలక నిర్ణయం..
Advertisement

Porsche: ఈరోజుల్లో ప్రతీ ఆటోమొబైల్ కంపెనీ ట్రెండ్‌కు తగినట్టుగా ముందుకు వెళ్లడానికే ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఫ్యూయిల్ కార్ల వల్ల లాభాలు అందుకుంటున్నా కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్ధమవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న క్రేజ్ వారు అలా చేసేలా ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో లగ్జరీ కార్ల సంస్థ కూడా తమ గ్యాస్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చడానికి సిద్ధమవుతోంది. అది మరెవరో కాదు.. పార్ష్.

పార్ష్ త్వరలోనే పార్ష్ మకాన్ అనే మోడల్ కారు విషయంలో కొన్ని కీలక మార్పులు చేయనుందని సమాచారం. ఈ మోడల్ నుండి తొలి ఎలక్ట్రిక్ కారును కూడా వచ్చే ఏడాదిలోపు లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్న క్రమంలో తమ గ్యాస్ పవర్డ్ కార్ల గురించి ఒక నిర్ణయానికి వచ్చిందట పార్ష్. కేవలం 2025 లేదా 2026 వరకే పార్ష్ గ్యాస్ పవర్డ్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత ఆ స్థానంలోకి ఎలక్ట్రిక్ కార్లు వచ్చేలాగా సన్నాహాలు చేస్తోందట.

Advertisement

పార్ష్ మకాన్ అనేది తన అద్భుతమైన మోడల్స్‌లో ఒకటిగా భావిస్తోంది. పైగా ఇది లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఆటోమొబైల్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. 2021, 2022లో పార్ష్ మకాన్ సేల్స్ ఆకాశాన్నంటాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల ఛార్జర్ల విషయంలో చాలా ఆటోమొబైల్ సంస్థలు.. టెస్లా సూపర్ ఛార్జర్స్‌పైనే ఆధారపడుతున్నాయి. కానీ పార్ష్‌కు అది ఇష్టం లేదని సెక్టార్‌లో టాక్ వినిపిస్తోంది. పార్ష్ ఎలక్ట్రిక్ మకాన్ కోసం సెపరేట్‌గా ఛార్జర్లను ఏర్పాటు చేయాలని అనుకుంటోందంట ఈ లగ్జరీ కార్ల సంస్థ.

ప్రస్తుతం కార్ల అమ్మకం విషయంలో పార్ష్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని ఆటోమొబైల్ రంగంలో టాక్ వినిపిస్తోంది. మకాన్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చడంతో పాటు మరెన్నో కీలక మార్పులు జరగనున్నాయని సమాచారం. ఇప్పటివరకు పార్ష్ కార్లను కేవలం డబ్బున్న వాళ్లు, కార్ల విషయంలో లగ్జరీని కోరుకునే వారు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పటినుండి అందరికీ ఈ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందట. మరి దీనికోసం పార్ష్ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×