E-Paper
Advertisement

Plantation:-వర్చువల్ రియాలిటీలో అడవుల పెంపకం..

Plantation:-వర్చువల్ రియాలిటీలో అడవుల పెంపకం..
Advertisement

Plantation:- వర్చువల్ రియాలిటీ (వీఆర్) అనేది ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తున్న టెక్నాలజీ. గేమ్స్ నుండి వర్క్ వరకు ఇది చాలా రంగాల్లో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమకు నచ్చిన వాతావరణాన్ని కూర్చున్న చోటు నుండే అనుభూతి చెందడానికి ఈ వర్చువల్ రియాలిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే మొక్కలు నాటే విషయంలో కూడా వీఆర్ సాయం ఎందుకు తీసుకోకూడదు అని పలువురు శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చింది.

గార్డెనింగ్, ప్లాంటేషన్ అనేది ఇప్పుడు చాలామందికి ఇష్టమైన హాబీగా మారింది. మొక్కలతో సావాసం మనిషి మెంటల్ హెల్త్‌ను యాక్టివ్‌గా ఉంచుతుందని తెలిసిన తర్వాత చాలామంది మొక్కల పెంపకంపై దృష్టిపెడుతున్నారు. దీనిని వర్చువల్ రియాలిటీలో కూడా ప్రవేశపెట్టాలని సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చింది. అందుకే ప్లాంటేషన్స్ గురించి కావాల్సినంత సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు. వారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఫారెస్ట్ మ్యానేజ్మెంట్ విషయంలో ఎంతో ఉపయోగపడుతుందని వారు హామీ ఇస్తున్నారు.

Advertisement

టెక్నాలజీ అనేది ఫారెస్ట్రీలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వర్చువల్ రియాలిటీలో, 3డీలో మొక్కల పెంపకం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశాన్ని అందరికీ ఇవ్వాలని వారు భావిస్తున్నారు. దీని ద్వారా అడవి అనేది ఎలా పెరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. మామూలుగా ఒక అడవిలోకి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అందులో ఉండే సమస్యలు ఏంటో అర్థం కాకపోవచ్చు.. కానీ వర్చువల్ రియాలిటీలో అడవిని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఈ సమస్యలు బయటికి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

వర్చువల్ రియాలిటీలో ప్లాంటేషన్ గురించి స్టడీ చేయడం ద్వారా అందులోని వేస్ట్‌ను కూడా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక్కసారి వీఆర్ ప్లాంటేషన్‌లోకి అడుగుపెట్టిన తర్వాత 20 ఏళ్ల క్రితం ఈ అడవుల పెంపకం ఎలా ప్రారంభమయ్యిందో కూడా ఇందులో చూసి తెలుసుకోవచ్చన్నారు. ఒకే ఈవెంట్‌ను మళ్లీ మళ్లీ చూడవచ్చన్నారు. ఈ వీఆర్‌లో అడవుల్లో రేగిన కార్చిచ్చుల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ప్రారంభం కావడం ఇదే మొదటిసారి.

Advertisement

మైనింగ్ వేస్ట్‌తో కాంక్రీట్.. మరింత ధృడంగా..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×