E-Paper
Advertisement

Paper cups:-పేపర్ కప్స్‌పై కొత్త ప్రయోగం.. స్టార్టప్ ఐడియాతో..

Paper cups:-పేపర్ కప్స్‌పై కొత్త ప్రయోగం.. స్టార్టప్ ఐడియాతో..
Advertisement

Paper cups:-ప్లాస్టిక్ అనేది ప్రాణాంతకం అని తెలిసినా కూడా దానిని మానవాళి నుండి దూరం చేయడం కష్టంగా మారింది. మన రోజూవారీ జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒక భాగంగా మారిపోయింది. అందుకే కుదిరినంత వరకు ప్రతీ ప్లాస్టిక్ వస్తువుకు ప్రత్యామ్నాయం తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వారికి పర్యావరణవేత్తలు కూడా సాయంగా నిలబడుతున్నారు. తాజాగా ఓ ఇండియన్ జంట కూడా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

ఒకప్పుడు ప్లాస్టిక్ కప్స్ అనేవి విచ్చవిడిగా వినియోగించేవారు. కానీ అవి మంచిది కాదని తెలిసిన తర్వాత.. వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్ కప్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం పాపులర్ కాఫీ షాప్స్‌లో సైతం ఈ పేపర్ కప్స్‌నే వినియోగిస్తున్నారు. కానీ ఈ పేపర్ కప్స్‌లో కూడా కొంచెం ప్లాస్టిక్ కలుస్తుందని తెలుస్తోంది. పేపర్ కప్స్‌పై వేసే కోటింగ్ కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. అయితే ఆ కోటింగ్‌ కూడా ప్లాస్టిక్‌తో చేయకూడదని ఓ స్టార్టప్ సంస్థ నిర్ణయించుకుంది.

Advertisement

తిరువనంతపురంకు చెందిన నితీష్, అనూ అనే జంట ఇటీవల గల్ఫ్ నుండి ఇండియాకు తిరిగొచ్చారు. ఇక్కడే ఒక స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా పర్యావరణానికి ఎలాగైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే పేపర్ కప్‌పై వచ్చే ప్లాస్టిక్ కోటింగ్‌ను మార్చాలనుకున్నారు. వీటిలో ఉపయోగించే ప్రొలీఫిక్ పర్యావరణానికి హాని కలిగించేదని తెలుసుకున్నారు. అందుకే దాని స్థానంలో ప్లాంట్ బేస్డ్ ఆయిల్‌తో పేపర్ కప్స్‌పై కోటింగ్ వేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ స్టార్టప్ సంస్థకు సీఎస్సైఆర్ ఎన్‌ఐఐఎస్టీ సాయంగా నిలిచింది. ఐడియా దగ్గర నుండి ఈ పేపర్ కప్స్ ఎగుమతి వరకు అన్నింటిలో ఒకరికి ఒకరు సాయంగా నిలివనున్నారు. వీరు కలిసి చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ ప్రొడక్ట్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. అంతే కాకుండా వీరి స్టార్టప్ సంస్థ ద్వారా పర్యావరణానికి హాని కలిగించని ఇతర ప్రొడక్ట్స్‌ను కూడా తయారు చేయాలని భావిస్తున్నారు.

Advertisement

టిక్‌టాక్‌తో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎడ్యుకేషన్..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×