E-Paper
Advertisement

Namma Yatri App : ఓలా, ఉబెర్‌కు షాకిచ్చేలా నమ్మ యాత్రి

Namma Yatri App : ఓలా, ఉబెర్‌కు షాకిచ్చేలా నమ్మ యాత్రి
Advertisement

Namma Yatri App : క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ కు… కర్నాటకలో అతి త్వరలో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఓలా, ఉబెర్ ఏకపక్ష దోపిడీకి విసిగిపోయిన కన్నడిగులు… రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేయడంతో… ఓలా, ఉబెర్ తో పాటు ర్యాపిడో ఆటో సేవల్ని కూడా నిలిపివేసింది… ప్రభుత్వం. ఆ తర్వాత బెంగళూరు ఆటో డ్రైవర్లు… నమ్మ యాత్రి పేరుతో సొంతంగా ఒక యాప్ రూపొందించుకున్నారు. లాంచ్ చేయకముందే నమ్మ యాత్రి యాప్ కు భారీ ఆదరణ లభించడం చూస్తుంటే… కచ్చితంగా అది సక్సెస్ అవుతుందనే చర్చ జరగుతోంది.

వచ్చే నవంబర్ 1 నుంచి నమ్మ యాత్రి యాప్ ద్వారా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది… బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్. ఇప్పటికే ఈ యాప్ డౌన్ లోడ్స్ పది వేలు దాటి పోయాయి. కస్టమర్లపై భారం పడకుండా… డ్రైవర్లకు నష్టం రాకుండా… అందరికీ ఆమోదయోగ్యం అనిపించేలా నమ్మ యాత్రి ఛార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఛార్జిని ఖరారు చేశారు. పికప్, డ్రాప్ లొకేషన్‌లను బట్టి… దగ్గర్లోని ఆటో డ్రైవర్లు చార్జీని కోట్‌ చేస్తారు. పికప్, డ్రాపింగ్‌ దూరాన్ని బట్టి, అదనంగా 10 నుంచి 30 రూపాయల వరకు… అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ నమ్మ యాత్రిలో ఛార్జి వసూలు చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తామని… భవిష్యత్ లో వాలెట్, ఆన్ లైన్ చెల్లింపు సౌకర్యానీ అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు… నమ్మ యాత్రి డెవలపర్లు. ఓలా, ఉబెర్ కంటే నమ్మ యాత్రి చాలా బాగుందని ఇప్పటికే అనేక మంది ప్రశంసించారు. ఈ యాప్ సేవలు ప్రారంభమైతే… ఇంకెంత ఆదరణ పొందుతుందో చూడాలి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×