// // low-cost electric scooters: ఓలా.. అదిరిపోలా! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

low-cost electric scooters: ఓలా.. అదిరిపోలా!

low-cost electric scooters: ఓలా.. అదిరిపోలా!
Advertisement
low-cost electric scooters

ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే ఓలా… తక్కువ బడ్జెట్లో రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. రూ.99,999కి S1, రూ.84,999కి S1 ఎయిర్ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ధర తక్కువ కాబట్టి వీటి బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ కూడా తక్కువే. 2 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన S1 స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 91 కిలోమీటర్లు, S1 ఎయిర్ సింగిల్ ఛార్జ్‌తో 85 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. S1 టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు కాగా… S1 ఎయిర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఆ వేగంతో వెళ్తే… అవి ప్రయాణించే దూరం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే… ఎక్కువ స్పీడ్ వల్ల అధికంగా విద్యుత్ ఖర్చవుతుంది కాబట్టి. లో స్పీడ్ జర్నీ చేస్తేనే… కంపెనీ పేర్కొన్న మైలేజ్ అందుకోవచ్చు.

S1 ఎయిర్ వేరియంట్‌లో… మొత్తం మూడు బ్యాటరీ ఆప్షన్స్‌ ఉన్నాయి. 2 కిలోవాట్ల బ్యాటరీతో 85 కిలోమీటర్లు, 3 కిలోవాట్ల బ్యాటరీతో 125 కిలోమీటర్లు, 4 కిలోవాట్ల బ్యాటరీతో 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మూడు వేరియంట్ల గరిష్ట వేగం 85 కిలోమీటర్లేనని ఓలా పేర్కొంది. గతంలో 2.5 కిలోవాట్ బ్యాటరీతో S1 ఎయిర్‌ బుక్‌ చేసిన యూజర్లు… ఆటోమేటిక్‌గా 3 కిలోవాట్ల బ్యాటరీకి అప్‌గ్రేడ్‌ అవుతారని ఓలా తెలిపింది.

Advertisement

కొత్త మోడళ్లు లాంచ్ చేయడంతో… మొత్తం 6 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న S1, S1 ప్రో వేరియంట్లకు అదనంగా S1 ఎయిర్‌లో మూడు వేరియంట్లు, S1లో ఒక వేరియంట్‌ రాబోతున్నాయి. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేసినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తెలిపారు. మార్పుల కారణంగా స్కూటర్ల డెలివరీ మూడు నెలలు ఆలస్యం అవుతుందని చెప్పారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×