E-Paper
Advertisement

Not in thousands.. layoffs in lakhs.. : వేలు కాదు.. లక్షల్లో కోతలు!

Not in thousands.. layoffs in lakhs.. : వేలు కాదు.. లక్షల్లో కోతలు!
Advertisement

Not in thousands.. layoffs in lakhs.. : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవ్వాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే… ఆదాయం తగ్గిపోవడం, మాంద్యం భయాలతో బడా కంపెనీల దగ్గరి నుంచి చిన్న సంస్థల దాకా అన్నీ ఉద్యోగుల్ని భారీ సంఖ్యలో తీసేస్తున్నాయి. దాంతో… ఏ క్షణం ఉద్యోగం ఊడిందనే వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 853 టెక్‌ కంపెనీలు లక్షా 37 వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయని ఓ సంస్థ తన నివేదికలో తెలిపింది. అదే కొవిడ్ మొదలైనప్పటి నుంచి చూసుకుంటే… ఈ సంఖ్య ఏకంగా 2 లక్షల 33 వేలు అని ఆ సంస్థ షాకింగ్ విషయం బయటపెట్టింది. కొవిడ్ దెబ్బకు కుదేలైపోయామని నిన్న మొన్నటి దాకా కోతలు పెట్టిన సంస్థలన్నీ, ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఉద్యోగుల్ని ఇష్టానుసారం పీకేస్తున్నాయని క్రౌడ్‌సోర్స్‌ డేటాబేస్‌ ఆధారంగా రూపొందించిన నివేదికలో layoffs.fyi తెలిపింది. ఒక్క నవంబర్‌ నెలలోనే అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీలు 73 వేల మందిని ఇంటికి పంపాయని నివేదిక పేర్కొంది. ఇందులో మెటా, ట్విటర్‌, సేల్స్‌ ఫోర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, సిస్కో, రోకు వంటి కంపెనీలు ఉన్నాయి. ఇదే బాటలో అమెజాన్‌, హెచ్‌పీ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి.

Advertisement

ఇక ఇండియాలోనూ 44 స్టార్టప్‌ కంపెనీలు దాదాపు 16 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇందులో బైజూస్‌, అన్‌ అకాడమీ, వేదాంతు, ఓలా, కార్స్‌ 24, మీషో, లీడ్‌, ఎంపీఎల్‌ వంటి స్టార్టప్‌ కంపెనీలులు ఉన్నాయి. వివిధ కంపెనీల్లో వేల మంది కాంట్రాక్ట్‌ సిబ్బంది కూడా ఉద్యోగాలు కోల్పోయారు. వచ్చే ఏడాది కూడా ఈ కోతలు తప్పవనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని చెబుతున్నారు… విశ్లేషకులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×