E-Paper
Advertisement

New one is Better : ట్విట్టర్‌ వద్దు.. కొత్తదే ముద్దు..

New one is Better : ట్విట్టర్‌ వద్దు.. కొత్తదే ముద్దు..
Advertisement

New one is Better: ట్విట్టర్ కొన్నది మొదలు ఎలాన్ మస్క్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్న యూజర్లు… ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. వెరిఫైడ్ యూజర్లకు ఇప్పటికే నెలకు 8 డాలర్లు వసూలు చేస్తానన్న మస్క్… త్వరలో యూజర్లందరికీ నెలవారీ ఛార్జీలు విధించవచ్చన్న ప్రచారం ప్రారంభం కావడంతో… ఇతర సోషల్ మీడియా యాప్స్ కోసం వెతుకుతున్నారు. దాంతో… లక్షల కొద్దీ కొత్త యూజర్లతో ట్విట్టర్ ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు.

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మాస్టోడాన్ దాదాపు ట్విట్టర్ లాగే పనిచేస్తుంది. యూజెన్ రోచ్కోచే అనే వ్యక్తి 2016లో దీన్ని స్థాపించారు. ద్వేష పూరిత ప్రసంగాలను, పోస్ట్‌లను నియంత్రిస్తూ… ఉచితంగా సేవలందిస్తోంది… మాస్టోడాన్. ట్విటర్‌ మస్క్ చేతుల్లోకి వెళ్లాక నెలకొన్న గందరగోళం నేపథ్యంలో… జర్నలిస్టులు, నటులు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్‌కి భారీగా షిప్ట్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన యూజెన్ ట్వీట్‌ ప్రకారం… ఈ ప్లాట్‌ఫామ్‌లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. అక్టోబర్‌ 27న మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు మాస్టోడాన్‌కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, మస్క్ ట్విట్టర్ కొన్న వారానికే 2,30,000 మందికి పైగా కొత్త యూజర్లు మాస్టోడాన్‌కు జతయ్యారు.

Advertisement

ఇక… ట్విటర్‌ ఫౌండర్‌, మాజీ సీఈవో జాక్ డోర్సే వారం కిందట లాంచ్‌ చేసిన బ్లాక్‌చెయిన్ ఆధారిత కొత్త సోషల్ మీడియా బ్లూ స్కైలో… 2 రోజుల్లోనే 30,000 మందికి పైగా సైన్ అప్ అయ్యారు. భారత్ కు చెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’ యాప్‌ కూడా ఇటీవల 50 మిలియన్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది. ఈ ఏడాది జనవరి నుంచి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్మెంట్‌లో ‘కూ’ భారీ వృద్ధిని సాధించింది. 2020లో ప్రారంభమైన ‘కూ’ యాప్…10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతాధికారులు, ప్రభుత్వోద్యోగులు ‘కూ’ యాప్‌ యూజర్లుగా ఉండటం విశేషం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×