E-Paper
Advertisement

Mars Updates : రెండు నెలలుగా మార్స్‌తో నో కమ్యూనికేషన్.. ఒక్కసారిగా మళ్లీ..

Mars Updates  : రెండు నెలలుగా మార్స్‌తో నో కమ్యూనికేషన్.. ఒక్కసారిగా మళ్లీ..
Advertisement
Mars Updates

Mars Updates : శాస్త్రవేత్తలు చేసే అన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఒక్కొక్కసారి వారు ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేసిన ప్రయోగాలు కూడా అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలా వారు ఎన్నోసార్లు ఫెయిల్ అయినా నిరుత్సాహ పడకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రయోగం ఫెయిల్ అయిపోయింది అనుకున్న తర్వాత అది మళ్లీ సక్సెస్ అయితే.. ఆ ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది కదా.. తాజాగా మార్స్‌పై జరిగిన ప్రయోగం విషయంలో అదే జరిగింది.

Advertisement

మార్స్‌పై ప్రయోగాలు చేయడం కోసం కొన్నాళ్ల క్రితం నాసాకు చెందిన ఒక డ్రోన్ అక్కడికి చేరుకుంది. కానీ రెండు నెలల క్రితం ఆ డ్రోన్‌తో భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు సంబంధాలు తెగిపోయాయి. ఫిబ్రవరి 2021లో పెర్సెవరీన్స్ రోవర్‌తో మార్స్‌పై దిగిన మినీ రోటర్‌క్రాఫ్ట్.. 30 రోజులు అక్కడే ఉండి కావాల్సిన పరిశోధనలు చేసేలా తయారయ్యింది. కానీ ఆ డ్రోన్.. మార్స్‌కు చేరుకొని ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు అసలు ఇది మార్స్‌పై ఉందా లేదా ప్రయోగాలు చేస్తుందా లేదా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు.

ఏప్రిల్ 26న చివరిసారిగా రోవర్‌తో కాంటాక్ట్ అయ్యారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత వారికి, ఆ డ్రోన్‌కు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సాంకేతిక లోపాల వల్లే కమ్యూనికేషన్ నిలిచిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు కూడా. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్)లోని మెషిన్ కంట్రోలర్‌లు.. 52వ సారి దానిని 1,191 అడుగుల అంటే 363 మీటర్లు ఎత్తుకు లేపిన 2 నిమిషాల తర్వాత కమ్యూనికేషన్ ఆగిపోయిందని బయటపెట్టారు. పెర్సెవరీన్స్, రోటర్ క్రాఫ్ట్ మధ్య ఒక గుట్ట లాంటి ఆకారం అడ్డుగా ఉండటంతో కమ్యూనికేషన్ నిలిచిపోయినట్టు వారు గుర్తించారు.

Advertisement

అప్పుడు తెగిపోయిన కమ్యూనికేషన్ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా ఓకే అయ్యింది. అయితే ఇంతకాలం ఒక ప్రయోగంతో సంబంధం తెగిపోయి.. సడెన్‌గా మళ్లీ ఏర్పడడం అనేది ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినప్పుడు రోటర్ తనను తాను కాపాడుకునేలా రూపొందించామని తెలిపారు. ఫెయిల్ అయింది అనుకున్న ప్రాజెక్ట్ మళ్లీ ఓకే అయ్యేసరికి చాలా సంతోషంగా ఉందంటున్నారు. కమ్యూనికేషన్ తెగిపోయినా కూడా రోటర్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×