E-Paper
Advertisement

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!
Advertisement

New Traffic Rules 2025:

వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వాహనాలు నడుపుతామంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఉల్లంఘటనల విషయంలో కఠిన నియంత్రణను తీసురావడమే లక్ష్యంగా కోట్లాది మంది వాహనదారులపై ఉక్కుపాదం మోపబోతోంది.

మోటారు వాహన చట్టంలో కీలక మార్పులు!

వాహనాలను కొనుగోలు చేయడమే కాదు, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలంటోంది కేంద్ర ప్రభుత్వం. లేదంటే, పెద్ద మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ సహా అన్ని పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. నిజానికి వీటి గురించి చాలా మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిమానా విధిస్తున్నారు. వాహనాలపై తరచుగా వారికి తెలియకుండానే పెనాల్టీ చలాన్లు జారీ చేయబడుతున్నాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, జరిమానాలు చెల్లించని వాహనాలు స్వాధీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు అప్ డేట్ చేయబోతోంది.

5 చలాన్లు పెండింగ్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్

Advertisement

కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలతో ఒక వాహనంపై లో ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్‌ ను సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు, వాహన యజమానులకు ట్రాఫిక్ చలాన్‌ ను క్లియర్ చేయడానికి 90 రోజుల వరకు సమయం ఉంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రేస్ పీరియడ్‌ ను త్వరలో 45 రోజులకు తగ్గించవచ్చు. ఆ సమయంలోపు జరిమానా చెల్లించకపోతే, అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు వాటిని విక్రయించలేరు. రిజిస్ట్రేషన్‌ ను పునరుద్ధరించలేరు.  చిరునామాను మార్చలేరు. యాజమాన్యాన్ని ఇతరుల మీదికి బదిలీ చేయలేరు. కొత్త ప్రతిపాదనలలో ఉల్లంఘన జరిగిన 15 రోజుల్లోపు ఈ చలాన్ నోటీసులు వాహనదారులకు చేరనున్నాయి.

Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్‌ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?

కేంద్రం నిర్ణయంపై మిశ్రమ స్పందన

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా ప్రతిపాదన మిశ్రమ స్పందనను రేకెత్తించింది. కఠినమైన నియమాలు రహదారి భద్రతను మెరుగుపరుస్తాయని కొంత మంది అంటుంటే,  చలాన్ వ్యవస్థ అవినీతి,  తప్పుడు జరిమానాలతో నడుస్తోందని మరికొంత మంది విమర్శిస్తున్నారు. రోడ్ల గురించి పట్టించుకోని ప్రభుత్వాలకు జరిమానా విధించే హక్కు లేదని మరికొంత మంది అంటున్నారు. కేవలం 2024లోనే  దేశ వ్యాప్తంగా రూ.12,000 కోట్ల విలువైన 8 కోట్లకు పైగా చలాన్లు జారీ అయ్యాయి. ఇక ఈ ముసాయిదా రూల్స్ మీద అభ్యంతరాలు, సూచనలను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే comments-morth@gov.in కు ఇమెయిల్ చేయాలన్నాది. ఈ ప్రజా అభిప్రాయాల ఆధారంగా ప్రతిపాదిత మార్పులు అమలు చేసే అవకాశం ఉంటుంది.

Read Also: చైనాలో అతి ఎత్తైన వంతెన.. దాని పొడవైన స్తంభాలపై రెస్టారెంట్.. జూమ్ చేస్తేనే చూడగలం!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×