E-Paper
Advertisement

Micro Electric Car : బుల్లి ఎలక్ట్రిక్ కార్.. రేపే లాంచ్..

Micro Electric Car : బుల్లి ఎలక్ట్రిక్ కార్.. రేపే లాంచ్..
Advertisement

Micro Electric Car : భారత రోడ్లపై దూసుకెళ్లేందుకు సిద్ధమైందో బుల్లి కారు. అది కూడా ఎలక్ట్రిక్ వెర్షన్. లుక్ లో టాటా నానోను… షేపులో మారుతి రిట్జ్ ను తలపిస్తున్న ఈ మైక్రో కార్లో… కేవలం రెండు సీట్లే ఉండటం విశేషం. ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేశారు.

ముంబైకి చెందిన PMV ఎలక్ట్రిక్​ సంస్థ… ఈ మైక్రో ఎలక్ట్రిక్​ కారును రూపొందించింది. దీని పేరు EaS-E. 4 నుంచి 5 లక్షల రూపాయల ధరలో ఈ బుల్లి కారును బుధవారం లాంచ్ చేస్తోంది… ​PMV ఎలక్ట్రిక్​ సంస్థ. ఇండియాలో ఆ కంపెనీ తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మైక్రో కార్ ఇదే.

Advertisement

EaS-E ఎలక్ట్రిక్ కార్ ను మూడు వేరియంట్‌లలో, 10 రంగుల్లో లాంచ్ చేస్తున్నారు. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్‌కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లైట్ బ్రౌన్, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఈ వెహికల్‌ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ​ 120 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని… దీని కోసం 3 కిలోవాట్ ఏసీ ఛార్జర్​ని ఇస్తున్నామని చెబుతోంది.

EaS-E ఎలక్ట్రిక్ కారులో డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​, ఏసీ, రిమోట్​ కీ లెస్​ ఎంట్రీ, రిమోట్​ పార్క్​ అసిస్ట్​, క్రూజ్​ కంట్రోల్​, సీట్​ బెల్ట్స్​ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మొత్తం బరువు 550 కేజీలు కాగా… 2,915 ఎంఎం పొడవు… 1,157 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తు ఉంది. ఇక వీల్​బేస్​ 2,087 మిల్లీమీటర్లు కాగా… గ్రౌండ్​ క్లియరెన్స్​ 170 ఎంఎంగా ఉందని చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×