E-Paper
Advertisement

శ్రీశైలం హైవేపై మృత్యుఘోష.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. స్పాట్‌లోనే..?

శ్రీశైలం హైవేపై మృత్యుఘోష.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. స్పాట్‌లోనే..?
Advertisement

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అమ్రాబాద్ మండలం దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును ఒక కారు వేగంగా ఢీకొట్టింది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ప్రయాణికులంతా హైదరాబాద్ నివాసితులుగా గుర్తించారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో బస్సులో ఉన్న ఒక మహిళ కిటికీ గుండా బయట పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి స్టీరింగ్ చక్రం మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేక దాదాపు గంటసేపు నరకయాతన అనుభవించాడు. స్థానికులు పోలీసులు తీవ్రంగా శ్రమించి అతడిని బయటకు తీశారు.

Advertisement

కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారిని అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. మల్లన్న దర్శనం చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఈ సంఘటన బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: రాష్ట్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం.. తడిసిన ధాన్యం, నేలకొరిగిన భారీ చెట్లు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×