E-Paper
Advertisement

Nagababu: ఉపాసనకు ట్విన్స్… డ్రాగన్,ఫోనిక్స్  అంటూ నాగబాబు పోస్ట్!

Nagababu: ఉపాసనకు ట్విన్స్… డ్రాగన్,ఫోనిక్స్  అంటూ నాగబాబు పోస్ట్!
Advertisement

Nagababu: ఉపాసన రాంచరణ్ దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వారి ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా అపోలో హాస్పిటల్ చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ చిరంజీవి ఇప్పటికే అపోలో హాస్పిటల్ వెళ్లడమే కాకుండా మీడియా వారితో కూడా తమకు పిల్లలు జన్మించడం గురించి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సుస్మిత, లావణ్య త్రిపాటి, రామ్ చరణ్ వంటి తదితరులు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లలు జన్మించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే మెగా తాతయ్య నాగబాబు (Naga Babu)సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు.

డియర్ డ్రాగన్.. ఫోనిక్స్

నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు (Twin Babies)జన్మించడం గురించి పోస్ట్ చేస్తూ..” డియర్ డ్రాగన్(Dragon) ఫోనిక్స్(Phoneix) కు మా కుటుంబంలోకి స్వాగతం. మీ రాకతో మా జీవితాలలో, మా కుటుంబంలో వెలుగులు నింపారు. అలాగే కుటుంబాన్ని పరిపూర్ణం చేశారు “అంటూ నాగబాబు ఉపాసన రాంచరణ్ దంపతులకు కవల పిల్లలు జన్మించడం గురించి విభిన్న రీతిలో స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ లావణ్య కుమారుడు…

Advertisement

ఇకపోతే ఇప్పటికే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు బాబు జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా కుమారుడు జన్మించడంతో మెగా ఆనందం డబల్ అయిందని చెప్పాలి.ఇక నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నారు అయితే ఈయన మెగా కుటుంబం విషయంలో మాత్రం ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉంటూ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా వెంటనే స్పందిస్తూ ఉంటారు మెగా కుటుంబం పట్ల ఎవరైనా విమర్శలు కురిపించిన వారికి తనదైన స్టైల్ లోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇలా మెగా కుటుంబ సంతోషంలో మాత్రమే కాకుండా బాధలో కూడా నాగబాబు పాలు పంచుకుంటూ ఉంటారు.

Advertisement

నాగబాబు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వెండితెరపై, బుల్లితెరపై పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఈయన రాజకీయాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నాగబాబు తిరిగి సినిమాలలో నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mega 158: మెగా 158 షూటింగ్ అప్డేట్.. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్..

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×