E-Paper
Advertisement

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ
Advertisement

Ernie: చాట్‌జీపీటీ.. టెక్ రంగంలో ఇదొక సంచలనం. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీతో మనుషుల పనులు మరింత సులభం అయిపోయాయి. ఏది కావాలన్నా క్షణాల్లో మన కళ్ల ముందు ఉంచుతుంది. ఏదైనా టాపిక్ చెబితే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్షణాల్లో మనకు అందిస్తుంది. అంతేకాకుండా దాన్ని మనకు నచ్చిన భాషలోకి కూడా మార్చుకోవచ్చు.

దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే చాట్‌జీపీటీ వల్ల నష్టాలు కూడా లేకపోలేదు. మనుషుల పనులు సలభతరం చేయడంతో ఇద్దరు చేయాల్సిన పనిని ఇక నుంచి ఒక్కరే చేయవచ్చు. ఈక్రమంలో మరొకరు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది.

Advertisement

ఇక చాట్‌జీపీటీని ఎదుర్కోవడానికి దిగ్గజ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాట్‌జీపీటీకి పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ బార్డ్ పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత చాట్‌‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన దిగ్గజ సెర్చ్ ఇంజన్ బైదూ కూడా చాట్‌జీపీటీకీ పోటీగా చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్‌ ఎర్నీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. మార్చి నుంచి ఎర్నీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×