E-Paper
Advertisement

Mutual Fund Investment : మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి. నష్టాలు ఉంటాయా, మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చా?

Mutual Fund Investment : మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి. నష్టాలు ఉంటాయా, మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చా?
Advertisement
Mutual Fund Investment

Mutual Fund Investment : స్టాక్ మార్కెట్లపై అవగాహన లేని వారికి మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ ఆప్షన్. తెలిసీ తెలియక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవడం కంటే.. మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. మరి.. మ్యూచువల్ ఫండ్స్‌లో నష్టాలు రావా. గ్యారెంటీగా లాభాలు ఇస్తాయా. ఇదే డౌట్ చాలా మందికి రావొచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వచ్చిందంటేనే.. వాటిలో ఏది బెస్ట్ అనే సెర్చింగ్ మొదలుపెడతారు. కస్టమర్లు అలా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టే.. దాదాపుగా అన్ని ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థలు.. బెస్ట్ ఫండ్స్ తీసుకొస్తున్నాయి. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం అనేది చాలా చాలా తక్కువ. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో మినిమం మూడేళ్లు పెట్టాలి. లేదంటే ఐదేళ్లు పెట్టుబడి పెట్టాలి. ఈ మూడేళ్లలో కచ్చితంగా లాభాలు వస్తాయి. ఒకవేళ మెచ్యూరిటీ అయిపోయి మీరు పెట్టుబడి తీసుకునే సమయానికి మార్కెట్లు విపరీతంగా పడిపోతే మాత్రం.. కొంత కాలం ఆగడం మంచిది. అప్పటికే, మంచి లాభాలు వచ్చి ఉన్నా.. ఆ సమయానికి కొన్ని లాభాలు తగ్గి ఉండొచ్చు. సో, టైంలో కొంత కాలం వెయిట్ చేయాలి.

Advertisement

ఇక.. ఒక ఏడాది పెట్టుబడి పెట్టి.. సరిగా లాభాలు రావడం లేదని మధ్యలో విత్‌డ్రా చేయడం మంచి పద్దతి కాదు. చాలా స్టాక్స్.. ఉండి ఉండి ఒకేసారి పెరుగుతాయి. ఏడాది పాటు పెరగని షేర్.. కొన్ని వారాల్లోనే పెరుగుతుంది. సో, మొదటి ఏడాది కాకపోయినా.. రెండో ఏడాదైనా లాభాలు వస్తాయి. ఒకవేళ మొదటి రెండేళ్లు అంతంత మాత్రం లాభాలు వచ్చినా సరే.. మూడో ఏడాది మాత్రం పక్కా. సో, మధ్యలో బయటికి వచ్చేయడం కరెక్ట్ కాదు.

నిజానికి గ్రోత్‌ బేస్డ్ విధానంతో పోలిస్తే వ్యాల్యూ బేస్డ్ పెట్టుబడుల విధానంలో కాస్త ఆలస్యంగా రిజల్ట్స్ వస్తాయి. అయినా సరే.. వాటిని కంటిన్యూ చేయాలి తప్పితే.. మధ్యలో బయటకు వచ్చేయకూడదు. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×