E-Paper
Advertisement

Musk repairs twitter : ట్విటర్‌కు మస్క్ మరమ్మతులు

Musk repairs twitter : ట్విటర్‌కు మస్క్ మరమ్మతులు
Advertisement

Musk repairs twitter : 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొన్న ఎలాన్ మస్క్… సంస్థ పనితీరులో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ట్విటర్‌లో ‘కంటెంట్ మోడరేషన్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ట్వీట్ చేశాడు… మస్క్.

కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటయ్యే దాకా ట్విటర్‌లో కంటెంట్‌ నియంత్రణ గురించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం గానీ.. ఖాతాల పునరుద్ధరణ గానీ జరగదని మస్క్‌ ట్వీటాడు. ప్రస్తుతానికి ట్విటర్లో కంటెంట్‌ నియంత్రణకు సంబంధించిన విధానాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే కౌన్సిల్‌ ఎలా పనిచేయబోతోందనేది మాత్రం… మస్క్ బయటపెట్టలేదు. ట్విటర్‌లో కంటెంట్‌ నియంత్రణకు సంబంధించిన విధానాలను సరళీకరిస్తామని… ట్విటర్ అల్గారిథమ్‌ను మరింత పారదర్శకంగా మారుస్తామన్న మస్క్… ఇప్పుడు తాజాగా కంటెంట్ నియంత్రణ కోసం కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు… ట్వీట్‌లకు యూజర్లు రేటింగ్‌ ఇవ్వడం ద్వారా… భవిష్యత్‌లో ట్విటర్‌ ఏ వెర్షన్‌ కావాలో ఎన్నుకునే అవకాశం వినియోగదారులకు కలుగుతుందని అంటున్నాడు… మస్క్. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న మర్నాడే భారీ మార్పులకు ముహూర్తం పెట్టిన మస్క్… భవిష్యత్తులో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోననే చర్చ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×