E-Paper
Advertisement

Musk:మస్క్‌కు కోర్టులో ఊరట.. ఇక ఆపగలరా?

Musk:మస్క్‌కు కోర్టులో ఊరట.. ఇక ఆపగలరా?
Advertisement

Musk:ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ ఊరటనిచ్చింది… శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు. 2018లో చేసిన ట్వీట్ ద్వారా ఆయన ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. టెస్లా ఇన్వెస్టర్లకు… మస్క్ నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది… శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు.

టెస్లా ప్రైవేట్‌ ఫండింగ్‌కు వెళ్తోందంటూ 2018లో మస్క్ ఓ ట్వీట్‌ చేశాడు. కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేసిన పెట్టుబడిదారులను అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ ట్వీట్ చేశాడు. కానీ… ఆ ఒక్క ట్వీట్‌ టెస్లా పెట్టుబడిదారులను బెంబేలెత్తించింది. ఆ ట్వీట్‌ కారణంగా టెస్లా కంపెనీ షేర్లు ఘోరంగా పతనమయ్యాయి. దాంతో… బిలియన్ల డాలర్ల మేర నష్టపరిహారం కోరుతూ… ఇన్వెస్టర్లు కోర్టును ఆశ్రయించారు. మస్క్ నిర్లక్ష్యం వల్ల టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయని వాదించారు. కానీ కోర్టు.. మస్క్‌కే అనుకూలంగా తీర్పునిచ్చింది. తన ట్వీట్‌ ద్వారా ఎలన్‌ మస్క్‌ ఎలాంటి మోసానికి పాల్పడలేదు కాబట్టి… వాటాదారులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరమే లేదని తేల్చేసింది. మస్క్‌ చేసిన ‘ఫండింగ్ సెక్యూర్డ్’ ట్వీట్ సాంకేతికంగా సరికాదన్న కోర్టు, ఎలన్‌ మస్క్‌ ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పింది.

Advertisement

కోర్టు తీర్పుతో మస్క్‌ ఇంకా చెలరేగిపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో మస్క్‌కు అనుకూలంగా తీర్పులు రావడంతో… ఇకపై తనకు ఏది అనిపిస్తే దాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించే అవకాశం ఉందని, అది భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ట్విట్టర్ కొన్నాక టెస్లాలో తన వాటాను భారీగా అమ్మేసుకున్నాడు… మస్క్. ఇప్పుడు టెస్లా మీద కాకుండా ట్విట్టర్ మీదే మస్క్ ఎక్కువగా దృష్టి పెడుతున్నాడన్న కారణంతో… చాలా మంది కూడా టెస్లా షేర్లు అమ్మేసుకున్నారు. ఆ దెబ్బతో టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. దాంతో… 2018లోనూ, ఇప్పుడు నష్టపోయిన టెస్లా ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.

For More Live Updates Follow Us :-

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×