E-Paper
Advertisement

Mumbai Boat Accident : పర్యాటకుల ఫెర్రీని ఢీకొట్టిన నేవీ స్పీడ్ బోట్.. సముద్రంలో పడిపోయిన 110 మంది ప్రయాణికులు

Mumbai Boat Accident : పర్యాటకుల ఫెర్రీని ఢీకొట్టిన నేవీ స్పీడ్ బోట్.. సముద్రంలో పడిపోయిన 110 మంది ప్రయాణికులు
Advertisement

Mumbai Boat Accident : ముంబయి సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా గా సముద్రంలో పర్యాటకులతో విహారానికి వెళ్లిన ఓ ఫెర్రీని భారత నేవీకి చెందిన స్పీడ్ బోట్ ఢీ కొట్టడంతో.. ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాద విషయం తెలియడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

ముంబయిలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్‌కమల్‌ అనే ఫెర్రీ.. దాదాపు 100 మందికి పైగా పర్యటకులతో బయలుదేరింది. బంగాళా ఖాతంలోని ఈ ఫెర్రీ ప్రయాణిస్తుండగా..సాయంత్రం 4 గంటల సమయంలో నేవీ స్పీట్ బోట్ ఢీ కొట్టింది. సముద్ర తీరంలో గస్తీ తిరిగే భారత నేవీ బోట్లు నిత్యం ఇక్కడ పహారా కాస్తుంటాయి. వాటిలో ఒకటి.. వేగంగా వచ్చి ప్రయాణికుల బోట్ ను ఢీ కొట్టింది. దాంతో.. ఫెర్రీ తీవ్రంగా దెబ్బతినడంతో, సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 101 మందిని సహాయక బృందాలు కాపాడాయి.  అయితే.. ఈ ఘటన సమయంలో ఫెర్రీతో పాటు నేవీ బోటులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.

Advertisement

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొని 101 మంది ప్రయాణికుల్ని, నేవీ సిబ్బందిని కాపాడి.. ఒడ్డుకు చేర్చారు.

ప్రమాద ఘటనపై స్పందించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో 13 మంది మృత దేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన సీఎం.. మృతుల్లో 10 మంది పర్యటకులు, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు.

Advertisement

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్రమాదానికి కారణమైన బోటు.. నేవీదా లేక కోస్టు గార్డుకు చెందినదా అనేది తెలియాల్సి ఉందని, స్పీడుపై నియంత్ర‌ణ త‌ప్ప‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు భావిస్తున్నట్లు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×