E-Paper
Advertisement

Motorola AC: మధ్యతరగతి స్పెషల్.. మోటరోలా ఏసీలు వచ్చేసాయోచ్.. వై-ఫై, యాప్ కంట్రోల్ మరెన్నో ఫీచర్లు!

Motorola AC: మధ్యతరగతి స్పెషల్.. మోటరోలా ఏసీలు వచ్చేసాయోచ్.. వై-ఫై, యాప్ కంట్రోల్ మరెన్నో ఫీచర్లు!
Advertisement

Motorola AC: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. సరికొత్త మోటరోలా (Motorola) ఎయిర్ కండీషనర్ల సిరీస్ ను తన ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 28,990 గా నిర్ణయించారు. ఇంతకీ ఈ మోటరోలా ఏసీల్లోని ఫీచర్లు ఏంటి? దీనిని కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు? ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఉచిత ఇన్‌స్టాలేషన్

సాధారణంగా ఏసీ కొన్న తర్వాత ఇన్‌స్టాలేషన్, కాపర్ పైపులు, స్టాండ్ వంటి వాటి కోసం విడిగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మోటరోలా ఏసీ కొంటే ఈ ఖర్చులన్నీ అసలు ధరలోనే కలిసిపోతాయి. ఇందులో ఉచిత ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్, హై-గ్రేడ్ కాపర్ పైపింగ్, అవుట్‌డోర్ యూనిట్ స్టాండ్ కూడా ఉచితంగా అందిస్తున్నారు.

3 ఏళ్ల గ్యాస్ రీఫిల్ వారంటీ

Advertisement

మోటరోలా తన 2026 మోడల్ ఏసీలపై మూడు సంవత్సరాల పాటు ఉచితంగా గ్యాస్ రీఫిల్ చేసే సౌకర్యాన్ని (Gas Refilling Assurance) కల్పిస్తోంది. దీనివల్ల వినియోగదారులకు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా గ్యాస్ లీకేజీ లేదా రీఫిల్లింగ్ సమస్యల వల్ల వచ్చే అదనపు భారం దీనితో తొలగిపోతుంది.

7 ఇన్ 1 కన్వర్టబుల్ మోడ్స్

ఈ ఏసీలలో అత్యాధునిక ‘7-ఇన్-1 కన్వర్టిబుల్’ టెక్నాలజీని అమర్చారు. గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మనం కూలింగ్ సామర్థ్యాన్ని 40% నుండి 110% వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల అవసరం లేనప్పుడు తక్కువ విద్యుత్ వినియోగంతో ఏసీని వాడుకోవచ్చు. తద్వారా కరెంటు బిల్లు ఆదా అవుతుంది.

స్మార్ట్ వై-ఫై, యాప్ కంట్రోల్

Advertisement

మోటరోలా ఏసీలు స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. వై-ఫై సదుపాయంతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ‘SmartLife’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఏసీని నియంత్రించవచ్చు. ఉష్ణోగ్రత మార్చడం, మోడ్స్ సెట్ చేయడం లేదా మీ డైలీ లైఫ్ కు అనుగుణంగా ఏసీ ఆన్/ఆఫ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు.

బ్లూ ఫిన్ టెక్నాలజీ

ఏసీలోని కండెన్సర్ కాయిల్స్ తుప్పు పట్టకుండా ఉండేందుకు ఇందులో బ్లూ ఫిన్ ప్రొటెక్టివ్ కోటింగ్ ఉపయోగించారు. ఇది తేమ, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల నుండి ఏసీని రక్షించి ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా చేస్తుంది. అలాగే ఇవి 100% కాపర్ కండెన్సర్‌తో వస్తాయి కాబట్టి చాలా వేగంగా గదిని చల్లబరిచేందుకు దోహదం చేస్తాయి.

Also Read: State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

ఏసీ వేరియంట్లు, వాటి ధరలు

ఫ్లిప్ కార్ట్ లో మెుత్తం 4 వేరియంట్లలో మోటరోలా ఏసీలు అందుబాటులో ఉన్నాయి. 1 టన్, 1.5 టన్ మోడల్స్ 3 స్టార్ రేటింగ్ తో రాగా.. 1.5లోనే మరో వేరియంట్ 5 స్టార్, 2 టన్ 3 స్టార్ రేటింగ్ ను కలిగి ఉన్నాయి. ప్రారంభ ఏసీ ధరను రూ.28,990గా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్ లో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న ఏసీని కోరుకునే మధ్యతరగతి వారికి మోటరోలా బెస్ట్ ఛాయిస్ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Indiramma Housing: క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడత ఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×