E-Paper
Advertisement

Hearing Issue:చెవి వినికిడి లోపం ఉన్నవారికోసం టెక్నాలజీ..

Hearing Issue:చెవి వినికిడి లోపం ఉన్నవారికోసం టెక్నాలజీ..
Advertisement

Hearing Issue:మనిషికి ఉన్న అయిదు సెన్సెస్‌లో ఏ ఒక్కటీ పనిచేయకపోయినా.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ అలాంటి లోపాలు ఉన్నవారికి కూడా సాయం చేయడానికి కృత్రిమంగా ఎన్నో పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా మరెన్నో టెక్నాలజీలు కూడా దివ్యాంగుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక చెవిలో వినికిడి సమస్య ఉన్నవారికోసం వారు ఓ కొత్త పరిష్కారాన్ని కనుక్కున్నారు.

చుట్టూ ఉన్న శబ్దాలను పసిగట్టే సామర్థ్యం చెవులకు మాత్రమే ఉంది. కొంతమందికి ఈ శక్తి ఎక్కువే ఉంటుంది. మరికొందరు మాత్రం ఈ సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా వినగలుగుతారు. అయితే ఒక చెవిలో వినికిడి సమస్య ఉన్నవారికి మాత్రం ఫలానా శబ్దాలు ఏ డైరెక్షన్ నుండి వస్తున్నాయి అన్నది కనుక్కోవడం కష్టంగానే ఉంటుంది. అలాంటి వారికోసమే బైనారల్ క్యూస్ కంటే మరింత మెరుగైన పరికరాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధపడ్డారు.

Advertisement

సౌండ్ ఏ వైపు నుండి వస్తుందో తెలుసుకోవడానికి మైక్రోఫోన్ ఏరేస్‌ను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీని ద్వారా ఏ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అన్న విషయాలు కనుక్కోవడానికి ఒక చెవిలో వినికిడి లోపం ఉన్నవారికి సులభంగా ఉంటుంది. కాకపోతే ఈ మైక్రోఫోన్ ఏరేస్ అరేంజ్ చేసే పద్ధతులు కూడా వినికిడి లోపం ఉన్నవారికి అనుకూలంగా ఉండేలాగా ఉండాలి. అందుకే వీటిలో మోనారల్ క్యూస్‌ను ఉపయోగించనున్నారు శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం రెండు చెవుల్లో వినికిడి లోపం ఉన్నవారికోసం బైనారల్ క్యూస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక చెవి లోపం ఉన్నవారికి పూర్తిస్థాయిలో ఉపయోగపడవు. అందుకే అలాంటి వారికోసం మోనారల్ క్యూస్‌‌ను తయారు చేశారు. సౌండ్ సిగ్నల్స్‌ను కనుక్కొని అవి ఏ డైరెక్షన్ నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి మోనారల్ క్యూస్‌ ఉపయోగపడనున్నాయి. మోనారల్ మాడ్యులేషన్ స్పెక్ట్రమ్ (ఎమ్ఎమ్ఎస్) ద్వారా దీని పరీక్షలు సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి. త్వరలోనే ఇవి ఒక చెవిలో వినికిడి లోపం ఉన్నవారికి అందుబాటులోకి రానున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×