E-Paper
Advertisement

ChatGPT Technology in Cars: కార్లలో చాట్‌జీపీటీ వినియోగం.. ముందడుగు వేసిన బెంజ్..

ChatGPT Technology in Cars: కార్లలో చాట్‌జీపీటీ వినియోగం.. ముందడుగు వేసిన బెంజ్..
Advertisement

ChatGPT Technology in Cars : చాట్‌జీపీటీ అనేది అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మెడికల్, లీగల్.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికీ చాట్‌జీపీటీ సామర్థ్యం ఏంటో అందరికీ నిరూపించింది. అందుకే ఆటోమొబైల్ రంగంలో కూడా చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలియడం కోసం మెర్సిడీస్ బెంజ్ కంపెనీ ముందుకొచ్చింది. చాట్‌జీపీటీ సామర్థ్య తెలుసుకోవడం కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది బెంజ్. ఈ పార్ట్‌నర్‌షిప్ తన కంపెనీ అప్‌గ్రేడ్‌కు ఉపయోపడుతుందని బెంజ్ నమ్ముతోంది.

ఇన్‌కార్ చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది కాస్ట్‌లీ కార్ల కంపెనీ మెర్సిడీజ్ బెంజ్. తాజాగా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా లాంచ్ అయ్యింది. కార్ల ఇన్‌ఫొటెయిన్మెంట్ సిస్టమ్‌ను స్టడీ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం ఎమ్‌యూఎక్స్ వాయిస్ అసిస్టెంట్ కస్టమర్లకు సాయం చేస్తుంది.

Advertisement

ఈ ప్రాజెక్ట్ వల్ల బెంజ్ కార్లలో‘హే మెర్సిడీజ్’ ఫీచర్ యాడ్ అవ్వనుంది. అంతే కాకుండా ఈ టెక్నాలజీ వల్ల కార్ల స్కోప్, రేంజ్ కూడా పెరుగుతుందని యాజమాన్యం అంటోంది. అంతే కాకుండా హే మెర్సిడీజ్ ఫీచర్ అనేది మెల్లగా తన భాషా సామర్థ్యాన్ని పెంచుకుంటూ అన్ని భాషల కస్టమర్లకు సాయంగా ఉంటుందని తెలిపింది. మెర్సిడీస్ బెంజ్ నిర్వహిస్తున్న టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో ఆసక్తి ఉన్న కస్టమర్లు జాయిన్ అవ్వవచ్చని ఆహ్వానించింది.

ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీల వల్ల డేటా ప్రైవసీ లాంటి సమస్యలు ఉంటాయేమో అని కస్టమర్లు భయపడుతున్నారు. అయితే డేటా ప్రొటెక్షన్ అనేది బెంజ్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. కస్టమర్ల దగ్గర నుండి ఈ సమాచారం తీసుకున్నా కూడా అది జాగత్ర్తగానే ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ అనేది పలు ఆటోనామస్ వాహనాల్లో ఉన్నా కూడా బెంజ్ అనేది చాట్‌జీపీటీని ఉపయోగించడం.. ఆటోమొబైల్ రంగంలో బెంజ్‌కు గ్రాండ్ లాంచ్‌గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×