E-Paper
Advertisement

Maruti Electric SUV Cars : మారుతీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

Maruti Electric SUV Cars : మారుతీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement
Maruti Electric SUV Cars

Maruti Electric SUV Cars : పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఎంతో పోటీని తట్టుకొని మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఎవరు ఎంత విమర్శించినా కూడా పాత పద్ధతులను మార్చుకోకుండా వాటితోనే కస్టమర్లను ఇంప్రెస్ చేస్తున్నారు. కానీ రోజులు మారాయి. ట్రెండ్‌కు తగినట్టుగా కస్టమర్ల ఇష్టాలు కూడా మారుతుండడంతో ఆటోమొబైల్ సంస్థలు కూడా కస్టమర్లను ఇంప్రెస్ చేయడం కోసం వాటి పద్ధతులను మార్చుకుంటున్నాయి. అందులో మారుతీ సుజుకీ కూడా ఒకటి.

Advertisement

మారుతీ సుజుకీ మోడల్ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. కస్టమర్ల ఇష్టాలకు తగినట్టు, ట్రెండ్ మారుతున్నకొద్దీ ఎన్నో కొత్త రకాల మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది మారుతీ. గత కొన్నేళ్లలో మారుతీ ఎస్‌యూవీ మోడల్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి ఎలక్ట్రిక్ కారు గురించి కొత్త అప్డేట్ బయటికొచ్చింది. ప్రస్తుతం ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ప్రోటోటైప్ టెస్టింగ్ దశలో ఉండగా.. ఇది అయిపోగానే ఫైనల్ ప్రొడక్షన్ ఉంటుందని, దాని తర్వాత లాంచ్‌‌కు సిద్ధమవుతుందని యాజమాన్యం తెలిపింది.

ఎస్‌యూవీ అంటే స్టైల్‌కు, కంఫర్ట్‌కు పెట్టింది పేరు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూడా స్టైల్‌కు, కంఫర్ట్‌కు ఏ మాత్రం లోటు ఉండదని యాజమాన్యం హామీ ఇస్తోంది. మామూలుగా ఇతర మారుతీ కార్లలో ఉండని ట్విన్ స్క్రీన్స్ లాంటి ఎన్నో కొత్త ఫీచర్స్ ఈ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉండనున్నాయి. హెడ్‌ల్యాంప్స్, వీల్ ఆర్చెస్ విషయంలో కూడా స్టైలింగ్‌ను మార్చి మరింత అల్ట్రా స్టైలిష్‌గా ఈ ఈవీక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సిద్ధం కానున్నాయి.

Advertisement

టెక్నాలజీల విషయంలో కూడా ఈవీఎక్స్ ఏ మాత్రం తగ్గడం లేదని మారుతీ అంటోంది. పానరోమిక్ సన్‌రూఫ్ లాంటి ఎన్నో టెక్నాలజీలో ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ఉండగా.. 550 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈవీఎక్స్ ఇంకా మార్కెట్లోకి రాకపోయినా దీని ప్రైజ్ మాత్రం రూ.20 నుండి 25 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని పలువురు మారుతీ రెగ్యులర్ కస్టమర్లు ఎదురుచూస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×