E-Paper
Advertisement

Human Evolution : కోతి నుండి మనిషి వచ్చాడా..? ఆధారం ఏంటంటే..?

Human Evolution : కోతి నుండి మనిషి వచ్చాడా..? ఆధారం ఏంటంటే..?
Advertisement

Human Evolution : ఆదిమానవుడు అనేవాడు కోతి నుండి వచ్చాడు అని సైన్స్ చెప్తుంది. అది నిజం కాదు అని వాదించేవారు కూడా ఉన్నారు. ముందుగా తెలివి వచ్చిన ఆదిమానవుడు రెండు రాళ్లతో నిప్పును సృష్టించాడు. అలా ఆదిమానవుడు చేసిన ఎన్నో ప్రయోగాలకు ఇప్పుడు టెక్నాలజీని జతచేర్చి మరింత మెరుగ్గా ఉపయోగిస్తున్నాం. అయితే అప్పటినుండి ఇప్పటివరకు సైన్స్ ఎలా మారింది, ఆదిమానవుడి నుండి తెలివైన మనిషి ఎలా బయటికి వచ్చాడు తాజా స్టడీలో తేలింది.

ఇప్పటిలాగా అప్పట్లో నగరాలు, ఎత్తైన బిల్డింగులు లేకపోవడంతో కోతుల రూపంలో ఉన్న మనిషి అడవుల్లో జీవిస్తూ నాలుగు కాళ్లపై నడిచేవాడు. మెల్లగా మనుషులు పెరగడం, చెట్లను నరికేయడం మొదలుపెట్టిన తర్వాత అడవులు ఎండిపోవడం మొదలయ్యింది. భూమిపై గడ్డి ఎక్కువగా పెరిగింది. అదే సమయంలో కోతులు మెల్లగా నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాయి. కానీ కేవలం దానివల్లే కోతుల నడక మారింది అనడం కరెక్ట్ కాదని కొందరు శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.

Advertisement

ఆదిమానవుడి కాలంలో రెండు రకాలు భూములు ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవే గడ్డి భూములు, పొదలు. వారు స్టడీ చేసినదానింటే 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఇవి ఉన్నాయని భావిస్తున్నారు. అయితే అడవుల్లో బ్రతికే కోతులు పండ్లను తింటూ పెరిగితే.. గడ్డిభూముల్లో నివసించిన కోతులు ఆకులను తింటూ పెరిగాయని వారు అనుమానిస్తున్నారు. అలా మెల్లగా కొన్ని కోతులు మనిషిలాగా మారాయని వారి అంచనా.

ఆదిమానవుడు గురించి, అంతకు ముందు నివసించిన కోతుల గురించి దాదాపు గత పదేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల కోసం చాలా ఏళ్ల క్రితానికి చెందిన చెట్లను శాస్త్రవేత్తలు సేకరించారు. ఆ చెట్లలో సీ4 చెట్లు అనేవి ఎన్నో ఏళ్లుగా ఎకోసిస్టమ్‌కు తోడ్పడుతున్నాయని గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే గడ్డిభూములు, పొదలు అనేవి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా ముందు నుండే ఉన్నాయన్న వారి అంచనా నిజమయ్యింది.

Advertisement

ఆదిమానవుడు కంటే ముందు జీవించిన కోతులను మోరోటోపైథెసస్ అంటారు. అవి దట్టమైన అడవుల్లో జీవించేవి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కువగా గడ్డిభూముల్లోనే వాటి జీవనాన్ని కొనసాగించాయని తెలిపారు. మోరోటోపైథెసస్‌పై వారు చేసిన పరిశోధనల్లో అవి గడ్డి కాకుండా పండ్లను తిరిగే పెరిగాయని నిరూపణ అయ్యిందన్నారు. అంటే ఇవే మెల్లగా ఆదిమానవుడిలాగా, మనిషిలాగా మారాయని దాదాపు నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×