// // Mahindra EV : మహీంద్రా ఈవీ ''కిస్బీ'' వచ్చేస్తోంది! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Mahindra EV : మహీంద్రా ఈవీ ”కిస్బీ” వచ్చేస్తోంది!

Mahindra EV : మహీంద్రా ఈవీ ”కిస్బీ” వచ్చేస్తోంది!
Advertisement

Mahindra EV : భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలకు పోటీగా… మహీంద్రా అండ్ మహీంద్రా నయా మోడల్ ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ “ప్యుగోట్ కిస్బీ”ని… వచ్చే ఏడాది మన దేశంలో రోడ్డెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

2023 జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కిస్బీ ధర… లక్ష రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో తీసుకొస్తున్న కిస్బీ… ఏథర్, ఓలా, బజాజ్, టీవీఎస్, హీరో సహా ఇతర స్టార్టప్ కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

Advertisement

ఇక కిస్బీ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే… 1.6 కిలోవాట్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ… గంటకు 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 42 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు. అంటే… ఇంటి నుంచి తక్కువ దూరంలో ఉండే మార్కెట్లు, స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లి వచ్చేందుకు మాత్రమే కిస్బీ ఉపయోగపడుతుంది. రోజూ 60 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించే వాళ్లు… కిస్బీ వైపు చూడకపోవడం బెటర్.

ఇటీవలే కిస్బీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది… మహీంద్రా అండ్ మహీంద్రా. ఇందులో హైటెక్ ఫీచర్లను జోడించారని సమాచారం. ట్యూబులర్ స్టీల్ వీల్,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్‌ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ తో కిస్బీ లాంచ్ కాబోతోందని భావిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×