E-Paper
Advertisement

Madapur: మాట తప్పని యువ సర్పంచ్.. పేద కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాస్

Madapur: మాట తప్పని యువ సర్పంచ్.. పేద కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాస్
Advertisement

మాట ఇస్తే తప్పని మనస్తత్వం, నిరంతరం ప్రజల బాగు కోరే తపన వెరసి గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ యువ సర్పంచ్ మాధరి శ్రీనివాస్ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. గ్రామమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా భావిస్తూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.

గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నూతన టాయిలెట్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వ నిధులు, గ్రామ సహకారంతో పాఠశాల రూపురేఖలను మార్చడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి శంకుస్థాపనలు చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.

Advertisement

మానవత్వమే మతం.. సేవయే మార్గం

కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడంలోనూ శ్రీనివాస్ ముందుంటున్నారు. గ్రామానికి చెందిన పోతూగంటి బుచ్చయ్య ఇటీవల మరణించడంతో.. వారి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సర్పంచ్ తక్షణమే స్పందించారు. తన వంతు సాయంగా ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తుల కష్టసుఖాల్లో తోడుగా ఉండటమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.

Advertisement

ఈ సేవా కార్యక్రమంలో గొడుగు స్వామి, నూనె చంద్ర రెడ్డి, మాడుగుల కరుణాకర్ రెడ్డి, గంగాధర మహేష్, సుంకరి రమేష్, ఆర్.ఎం.పి సత్యనారాయణ, సంపతి రాములు, గొడుగు చంద్రయ్య, గోవిందు సంతు, బొడిగె అరుణ్, దమ్మగాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. యువ సర్పంచ్ తీసుకుంటున్న చొరవను ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×