E-Paper
Advertisement

Lung Inflammation: ఊపిరితిత్తుల్లో వాపును ముందే కనిపెట్టవచ్చా?

Lung Inflammation: ఊపిరితిత్తుల్లో వాపును ముందే కనిపెట్టవచ్చా?
Advertisement

Lung Inflammation: మన శరీరంలో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు, బయటి వాతావరణంలో నుంచి ఆక్సిజన్‌ను మన శరీరంలోకి పంపించడం, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను బయటికి పంపడం ఇది ప్రధాన విధి. అయితే కొన్ని ఇన్‌ఫెక్షన్లు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి వాపునకు గురై ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాపు అనేది విష పదార్ధాలు, కాలుష్యం, అలెర్జీకి గురవడం వల్ల వస్తుంటుంది. ఇది ఊపిరితిత్తులకు శాశ్వతంగా హాని కలిగిస్తుంది. న్యుమోనియా, ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌తో తీవ్రమైన వాపు వస్తుంది. ఆస్తమా, క్రానిక్‌ అబ్స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌లలో కూడా దీర్ఘకాలిక మంట ఉంటుంది. తరచుగా దగ్గు రావడం, గురక వల్ల ఈ వాపు లక్షణాలను పట్టించుకోం. కానీ ఊపిరితిత్తుల సంబంధ వ్యాధుల లక్షణాలు తేలికగానే ఉంటాయి. ముందే గుర్తించడంతో ప్రమాదాన్ని అరికట్టవచ్చు. గాలి అందడం లేదనే భావన, గురక, దీర్ఘకాల దగ్గు, జ్వరం, దగ్గుతో పాటు రక్తం పడటం, ఛాతీలో దీర్ఘకాలిక నొప్పి వల్ల ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుంది.

Advertisement

జంతువులతో సహవాసం చేయడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు దరిచేరి వాపునకు కారణం అవుతాయి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉండకపోవడం, స్మోకింగ్‌ చేయకుండా ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.60 ఏళ్లు దాటినవారిలో మరియు ఐదేళ్ల లోపు చిన్నారుల్లో దీర్ఘకాలిక పరిస్థితులు కనిపిస్తాయి. ఏవైనా లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాలి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×