E-Paper
Advertisement

Long Weekends : టూర్స్ ప్లాన్ చేస్తున్నారా ? మార్చి వరకూ కలిసొచ్చే లాంగ్ వీకెండ్స్ఇవే..

Long Weekends : టూర్స్ ప్లాన్ చేస్తున్నారా ? మార్చి వరకూ కలిసొచ్చే లాంగ్ వీకెండ్స్ఇవే..
Advertisement

Long Weekends : ఉదయం లేచిన దగ్గర్నుండీ.. రాత్రి పడుకునేంత వరకూ.. అంతా ఉరుకుల పరుగుల జీవితం. సరిగ్గా భోజనం చేసే సమయం కూడా ఉండదు. అంత బిజీ షెడ్యూల్ లో వారాంతం వస్తే.. కాస్త రిలాక్స్ అవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటపుడు ఇంట్లోనో, హాస్టల్స్ లోనో ఉండిపోకుండా సరదాగా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా స్మాల్ పిక్ నిక్ కో.. నేచర్ కు దగ్గరగా ఉండే ప్లేస్ లకో వెళ్లాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు సెలవులతో అసలు చిక్కులొచ్చిపడతాయి. అందుకే.. వారాంతపు సెలవులతో కలిసొచ్చిన లాంగ్ వీకెండ్స్ తో వరుసగా మూడ్రోజులు ట్రిప్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఏడాదిలో చాలా అరుదుగా వచ్చే లాంగ్ వీకెండ్స్ ఈ ఏడాదిలో వచ్చాయి. ఆ లిస్ట్ ఏంటో ఓ లుక్కేయండి మరి.

జనవరి 26-28 వరకు..

Advertisement

జనవరి 26 రిపబ్లిక్ డే హాలిడే. ఆదివారం సాధారణ సెలవు. మధ్యలో శనివారం ఒక్కరోజు సెలవుంటే సరిపోతుంది. సాఫ్ట్ వేర్లు, ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆ అవసరం కూడా ఉండదు. వరుసగా మూడురోజులు సెలవులే.

మార్చి 8-10

Advertisement

మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవు. 9వ తేదీ రెండో శనివారం, 10 ఆదివారం. ఇది కూడా లాంగ్ వీకెండే.

మార్చి 23-25

మార్చి 25వ తేదీ సోమవారం హోలీపండుగ. దానికి ముందు నాల్గవ శనివారం, ఆదివారం ఎటూ సెలవులే.

మార్చి 29-31

మార్చి నెలలలోనే మరో లాంగ్ వీకెండ్ ఉంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే హాలిడే. శనివారం ఒక్కరోజు సెలవుంటే చాలు. ఆదివారం మళ్లీ సెలవే.

ఇలా జనవరి చివరి వారంలో.. మార్చిలో ఏకంగా మూడు వారాంతాల్లో.. లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. మరి మీరెక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే.. ఈ సెలవుల్ని ఒకసారి చూసుకోండి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×