E-Paper
Advertisement

LED TVS: స్మార్ట్ టీవీ.. మరింత సన్నంగా..

LED TVS: స్మార్ట్ టీవీ.. మరింత సన్నంగా..
Advertisement

LED TVS:ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు మనం ఉపయోగించే రోజూవారి వస్తువుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గ్యాడ్జెట్స్ విషయంలో రోజుకొక టెక్నాలజీ పుట్టుకొస్తోంది. ఒకప్పుడు ఇతరులను కాంటాక్ట్ చేయడానికి ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉండేవి. తర్వాత కీప్యాడ్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా స్మార్ట్ ఫోన్లు.. అందులోనూ వివిధ రకాల టెక్నాలజీలు. అదే విధంగా టీవీల విషయంలో కూడా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు ఊరికి ఒక టీవీ ఉండడం గొప్ప విషయం. అది కూడా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. ఆ తర్వాత కొంచెం చిన్న సైజ్‌లో సౌకర్యంగా ఉండే టీవీలు తయారు చేయబడ్డాయి. ఆపై ప్లాస్మా టీవీలు, ఇప్పుడు ఏకంగా స్మార్ట్ టీవీలే వచ్చేశాయి. ఫోన్‌లో ఉన్నట్టుగా టీవీలో కూడా అన్ని రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా చూడడానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉండే టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఇది సరిపోదంటూ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు మరో కొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు.

Advertisement

ఇప్పుడు ప్రతీ టీవీల్లో హెచ్‌డీ టెక్నాలజీ ఉంటుంది. అంతే కాకుండా చాలా సన్నగా ఉండే టీవీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరింత సన్నాగా చేయడానికి ఆస్ట్రేలియన్ పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న చాలా రకాల టీవీల కంటే ఇవి మరింత మెరుగ్గా పనిచేసేలాగా ఇవి తయారు చేయబడుతున్నాయి. వీటిలో మెటాసర్ఫేసెస్ అనే టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయనున్నారు.

మెటాసర్ఫేసెస్ ద్వారా ఇప్పుడు ఉన్నవాటి కంటే మరింత సన్నగా టీవీలు తయారు కానున్నాయి. ఇవి డిస్ల్పేను మరింత మెరుగ్గా మార్చేలా ఉపయోగపడనున్నాయి. అంతే కాకుండా ఇందులో ఉపయోగించే లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ విషయంలో కూడా అనేక మార్పులు చేయనున్నారు శాస్త్రవేత్తలు. లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ అనేది టీవీలోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది. రెసల్యూషన్ విషయంలో, కరెంటు వాడకం విషయంలో అన్నీ దీనిపైనే ఆధారపడుంటాయి.

Advertisement

మెటాసర్ఫేసెస్ అనేది కేవలం టీవీల విషయంలోనే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కూడా ఉపయోగపడేలా ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ విషయంలో మెటాసర్ఫేసెస్ ఎనర్జీని సేవ్ చేసే విధంగా ఉంటాయి. అందుకే ఇది గత 20 ఏళ్ల నుండి ఉంటున్న టీవీల టెక్నాలజీల్లో సంచలనం సృష్టించనుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Diseases:గోధుమల వల్ల ఏర్పడే వ్యాధులపై పరిశోధనలు..

Computer Chips Efficient:కంప్యూటర్ చిప్స్‌ను మెరుగుపరిచే డైమండ్లు..

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×