E-Paper
Advertisement

Kalinga: బాబోయ్.. కళింగ టీజర్ చూశారా..? చూస్తుంటే గూజ్‌బంప్స్ వస్తున్నాయి

Kalinga: బాబోయ్.. కళింగ టీజర్ చూశారా..? చూస్తుంటే గూజ్‌బంప్స్ వస్తున్నాయి
Advertisement

Kalinga Movie: కిరోసిన్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి విభిన్నమైన కథతో రూపొందుతున్న మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ‘కళింగ’ మూవీ. ఈ సినిమాలో ధృవ వాయు ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఈ ప్రాజెక్టుకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, ప్రథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ను క్రియేట్ చేస్తుంది. ఇటీవలే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ కు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను బాలీవుడ్ స్టార్ జాకి ప్రాఫ్ ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్ కు కూడా భారీగా రెస్పాన్స్ రావడమే కాదు.. ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను పీహెచ్ఎఫ్ ఎల్ఎల్ సీ సంస్థ సొంతం చేసుకున్నది. మరో విషయమేమంటే.. ఈ సినిమా హిందీ రైట్స్ కోసం కూడా పలు సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్ కు తగ్గ కథాంశంతో.. ఫిక్షనల్ డ్రామా విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమాకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఆడియన్స్ ప్రతి సన్నివేశంలోనూ థ్రిల్లింగ్ కు గురవుతారు. టీచర్ లో ఉన్న సంభాషణలు, హీరో ధృవ వాయి అద్భుత నటన, స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఎంతో బజ్ ను తీసుకువచ్చాయి. ఇది కేవలం టీజర్ మాత్రమే, ఇక సినిమాలో పలు సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ కు గూజ్ బంప్స్ వస్తాయి. ఇటు చిత్ర ప్రమోషన్స్ ను కూడా అగ్రెసివ్ గా చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Advertisement

Also Read: భలే ఉన్నాడే ట్రైలర్‌తో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ మూవీలో ధృవ వాయు హీరోగా నటించగా, ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆడుకాలం నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, మురళీధర్ గౌడ్, షిజు ఏఆర్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్థిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్రతోపాటు పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×