E-Paper
Advertisement

Jio 5G Services : హైదరాబాద్‌లో జియో 5G

Jio 5G Services : హైదరాబాద్‌లో జియో 5G
Advertisement

Jio 5G Services : హైదరాబాద్‌లో మరో మొబైల్ నెట్ వర్క్ కంపెనీ 5G సేవలు ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5G సేవలు అందిస్తుండగా… ఇప్పుడు రిలయన్స్ జియో కూడా 5G సర్వీసులు ప్రారంభించింది. హైదరాబాద్ తో పాటు బెంగళూరులోనూ 5G సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది… జియో.

దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నత్‌ద్వారా నగరాల్లో ఇప్పటికే ట్రూ-5G బీటా సేవలు అందిస్తున్న జియో… హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5G సేవల ప్రారంభంతో ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగవుతాయని ప్రకటించింది. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5G సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నామని తెలిపింది. ట్రూ-5G వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత యూజర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా… 1GBPS వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో పేర్కొంది. అయితే… 5G కంపాటబిలిటీ స్మార్ట్‌ఫోన్లు కలిగిన వాళ్లు… అందులో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు… 5G సేవలు నగరం అంతటా కాకుండా, కేవలం కొన్ని ప్రధాన ప్రాంతాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఐఫోన్ యూజర్లు ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లపై 5G సేవలు పొందేందుకు వీలుగా… వాటిల్లో 5G బీటా సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను ఆపిల్‌ అప్‌డేట్‌ చేసింది. వినియోగదారులు ఈ అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, 5G సేవలు పొందాలని… ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించేలా… బీటా వెర్షన్‌ తీసుకొచ్చినట్లు ఆపిల్‌ వెల్లడించింది. డిసెంబర్లో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్‌ విడుదల చేస్తామని ఆపిల్ తెలిపింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 సిరీస్‌లోని అన్ని మోడళ్లతో పాటు ఐఫోన్‌ SE మోడళ్లకూ 5G బీటా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందుబాటులో ఉందని ఆపిల్ వెల్లడించింది. బీటా ప్రోగ్రామ్‌ కోసం సైన్‌ అప్‌ చేసుకున్న యూజర్లకు మాత్రమే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయ్యి 5G సేవలు వాడుకునే సదుపాయం ఉందంటోంది… ఆపిల్. ఆపిల్‌ ఐడీపై ఐక్లౌడ్‌ అకౌంట్ ఉన్న యూజర్లు కూడా బీటా ప్రోగ్రామ్‌కు సైన్‌ అప్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫోన్లో సెట్టింగ్స్ లోకి వెళ్లి… 5G ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుని… జియో, ఎయిర్‌టెల్‌ 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్న చోట వాడుకోవచ్చని ఐఫోన్ యూజర్లకు సూచించింది… ఆపిల్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×