E-Paper
Advertisement

Japanese success formula : కూల్‌గా సంపాదన.. జపనీస్ ఫార్ములా ఇదే..!

Japanese success formula : కూల్‌గా సంపాదన.. జపనీస్ ఫార్ములా ఇదే..!
Advertisement
japanese success formula

japanese success formula : మనందరికీ డబ్బు అవసరమే. అయితే.. దానిని మనం ఎలా సంపాదిస్తున్నామనేది ముఖ్యం అంటారు జపనీయులు. అక్రమంగా, మరీ కష్టపడి సంపాదించే డబ్బు సంతోషాన్ని, సక్సెస్‌ను ఇవ్వదని వారి ఫీలింగ్. అందుకే ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా డబ్బు సంపాందించే ‘అరిగాటో’ అనే సూత్రాన్ని వారు డబ్బు విషయంలో ఫాలో అవుతుంటారు.

జపనీస్ భాషలో ‘అరిగాటో’ అంటే.. ‘థాంక్స్’ అని అర్థం. సంపద మనిషికి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వకపోతే వేస్ట్ అని వారి భావన. అదే.. సంతోషంగా సంపాదించిన డబ్బు కొత్త ఉత్సాహాన్ని, మరింత సక్సెస్‌ను ఇస్తుందని వారి నమ్మకం. ఒక పని వల్ల ఎంత లాభం అనిగాక.. ఆ పని వల్ల ఎంత సంతృప్తి అనేదే వారి ఫిలాసఫీ. దీనివల్ల వారు ఎక్కువ పనిని ఇష్టంగా, నాణ్యంగా చేయగలుగుతున్నారు.
ఈ ఫార్ములాలో.. సంతోషాన్నిచ్చే డబ్బు, సంతోషాన్ని ఇవ్వని డబ్బు అనే రెండు రకాలుంటాయి.

Advertisement

కుటుంబ అవసరాలకు, ఇష్టమైనవారికై ఖర్చు పెట్టే డబ్బును వారు హ్యాపీ మనీ అంటారు. దీన్ని ఇచ్చిన సమాజానికి వారు థాంక్స్ చెబుతారు. రెండోది.. అప్పులు, విలాసాలు, మొహమాటపు ఖర్చులు, సంప్రదాయలపై అయిష్టంగా పెట్టే ఖర్చు. ఇది వారి దృష్టిలో అన్ హ్యాపీ మనీ. జపనీయుల్లో చాలామంది మొదటిది ఉంటే చాలని అనుకుంటారు. దీనివల్ల డబ్బు యావ తగ్గి, పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తాయనీ, ఇలా ఆలోచించే వారి సంఖ్య పెరిగే కొద్దీ తమ దేశం.. ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన, సంతోష దేశంగా మారుతుందని వారు బలంగా నమ్ముతారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×