E-Paper
Advertisement

Pulwama Attack: పుల్వామా సెగలు.. 8 ఏళ్లు గడిచినా ఆరని గాయం.. కశ్మీర్ లోయలో హై అలెర్ట్!

Pulwama Attack: పుల్వామా సెగలు.. 8 ఏళ్లు గడిచినా ఆరని గాయం.. కశ్మీర్ లోయలో హై అలెర్ట్!
Advertisement

Pulwama Attack: ఫిబ్రవరి 14, భారత సైనిక చరిత్రలో ఒక మాయని మచ్చగా, తీరని వేదనగా మిగిలిపోయింది. 2019లో సరిగ్గా ఇదే రోజున పుల్వామాలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఈ ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న తరుణంలో, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు.

పుల్వామా విషాదం..
2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్‌కు సుమారు 2,500 మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లతో వెళ్తున్న భారీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పుల్వామా జిల్లాలోని లేథిపురా వద్ద పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం వేగంగా వచ్చి సైనికుల బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర ఆత్మాహుతి దాడిలో 40 మంది వీర జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మరోసారి ఎండగట్టింది.

Advertisement

ఈ అమానుష దారి వెనుక పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అదిల్ అహ్మద్ దార్ అనే స్థానిక ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడగా, దీని వెనుక ఉన్న సూత్రధారులు సరిహద్దుల అవతల నుంచి వ్యూహరచన చేశారు. ఈ ఘటనకు ప్రతికారం తీర్చుకుంటూ భారత్ తదుపరి కొద్ది రోజుల్లోనే ‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్’ ద్వారా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, శత్రువులకు గట్టి హెచ్చరిక పంపింది.

అయితే పుల్వామా దాడి జరిగి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా (High Alert) ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనగర్, లాల్ చౌక్, పర్యాటక ప్రాంతమైన డాల్ లేక్ పరిసరాల్లో నిఘా నీడ కమ్ముకుంది. ఉగ్రవాదులు మళ్లీ ఏదైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు హోటళ్లు, లాడ్జీలు, అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

Advertisement

భారత మాత ముద్దుబిడ్డలైన ఆ 40 మంది జవాన్ల త్యాగం వృధా పోలేదు. వారి స్మారకార్థం లేథిపురా వద్ద నిర్మించిన స్మారక చిహ్నం వద్ద నేడు సైనిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా వేదికగా, వివిధ కార్యక్రమాల ద్వారా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ‘మర్చిపోలేం.. క్షమించలేం’ అనే నినాదంతో భారత ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.

Also Read: విజయ్ ర్యాలీలో విషాదం.. కరూర్ ఘటన తర్వాత మళ్ళీ సేలంలో..

పుల్వామా ఘటన తర్వాత భారత రక్షణ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. కాన్వాయ్ కదలికల విషయంలో కొత్త నిబంధనలు (SOPs) అమలులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ మరింత బలోపేతం చేయబడింది. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తూ, ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×