E-Paper
Advertisement

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ
Advertisement

OTT Movie : అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో యాక్ష‌న్ సీన్స్ తో ఔరా అనిపించాడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ మూవీతో అదిరిపోయే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. ఈ సినిమాతో దర్శకుడిగా, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు గోపీచంద్. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఒక మాఫియాని ఎదుర్కునే పాత్రలో సన్నీ యాక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.  యాక్షన్ అభిమానులకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘జాట్’ (Jaat) గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో సన్నీ డియోల్,రాణాదేవ్ హూడా, వీనెత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సైయామి ఖేర్, రమ్యా కృష్ణ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. జూన్ 5 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబి లో దీనికి 6.0/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి గ్రామంలో రణతుంగ అనే శ్రీలంక రబ్బరు గ్యాంగ్‌ స్టర్ రూల్ చేస్తుంటాడు. రణతుంగ 15 సంవత్సరాలుగా గ్రామస్తులను భయపెట్టి, డబ్బు, భూములను లాక్కుని దౌర్జన్యం చేస్తుంటాడు. అతని భార్య భారతి, సోదరుడు సోములు కూడా అతని గ్యాంగ్‌లో కీలకంగా ఉంటారు. వీళ్ళ వల్ల గ్రామస్తులు భయంతో వణికి పోతుంటారు. పోలీసులు కూడా అతన్ని టచ్ చేయలేక పోతుంటారు. ఒక రోజు ఒక రోడ్‌ సైడ్ టిఫిన్ సెంటర్ కి, ఒక వ్యక్తి (సన్నీ డియోల్) వస్తాడు. అతను వెళ్లాల్సిన ట్రైన్ ఒక చిన్న లోపంతో అక్కడ ఆగిపోతుంది. దీంతో అతను ఆ గ్రామంలో ఇడ్లీ తిన్తుండగా, రణతుంగ గ్యాంగ్ లో ఒకడు అతన్ని డిస్టర్బ్ చేస్తాడు. జాట్ సారీ చెప్పమని అడుగుతాడు. వాళ్లు చెప్పకపోగా అతన్ని బెదిరిస్తారు.

Read Also : అర్దరాత్రి అమ్మాయిల్ని చంపే సైకో… ఒంటరి ఆడపిల్లలే టార్గెట్… మెంటల్ మాస్ ట్విస్టులు

ఇక్కడి నుంచి కథ యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. జాట్ వాళ్ళకు తగిన బుద్ది చెప్తాడు. దీంతో ఆ గ్రామస్తులకు ఇతను హీరో అవుతాడు. రణతుంగ గ్యాంగ్‌తో ఇతనికి చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. జాట్ గ్రామస్తులకు అండగా నిలుస్తాడు. ఆ గ్రామంలో రణతుంగ రూల్‌కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటాడు. ఇక ఎలాగైనా ఇక్కడ జరిగే ఆరాచకాలను ఆపాలని అనుకుంటాడు. అయితే రణతుంగ, అతని గ్యాంగ్ మొత్తం ఒక్క సారిగా జాట్ పై అటాక్ చేస్తారు. జాట్ ఒక్కడే వాళ్లను తీవ్రంగా ఎదుర్కుంటాడు. ఈ యాక్షన్ లో ఎవరు ఓడిపోతారు ? ఆ గ్రామస్తులకు న్యాయం జరుగుతుందా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×