E-Paper
Advertisement

Radish : ముల్లంగితో పాటు ఇవి తింటే డేంజర్

Radish : ముల్లంగితో పాటు ఇవి తింటే డేంజర్
Advertisement

Radish : ముల్లంగి.. ఇది చలికాలంలో విరివిగా లభిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, ఐరన్‌, కాల్షియంలాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ముల్లంగి జీర్ణక్రియకు చాలా మంచిది. అందుకే దీన్ని ఎక్కువ మంది చలికాలంలో తినేందుకు మక్కువ చూపుతారు. చాలా మంది ముల్లంగితో పచ్చడి కూడా చేస్తారు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను దరిచేరనీయదు. అయితే ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఆహారపదార్థాలు, పానీయాలు అస్సలు తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ముల్లంగి తిన్న తర్వాత, ముందు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేస్తే మలబద్దకం పెరిగి ఆమ్లత్వానికి కారణం అవుతుంది. ఎందుకంటే ముల్లంగి, మూలి ప్రకృతిలో చల్లగా ఉంటుంది. టీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. అందుకే టీ, ముల్లంగి కాంబినేషన్ మంచిది కాదని అంటున్నారు. ముల్లంగితో పాటు చేదు ఉండే కాకరకాయను తీసుకోవడం కూడా మంచిది కాదు. రెండింటిలో కనిపించే సహజ మూలకాలు ఒకదానితో కలవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మీకు శ్వాస సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ముల్లంగితో పాటు ఆరెంజ్‌ని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. వీటి కలయిక విషంలా పనిచేస్తుంది. చాలా మంది దోసకాయ, ముల్లంగి మంచి కాంబినేషన్ అనుకుంటారు. కానీ దోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది. ఇది విటమిన్‌-సీని పీల్చుకునేలా చేస్తుంది. అలాగే ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం మంచిదికాదని అంటున్నారు. ఎందుకంటే ముల్లంగి శరీరంలో వేడిని పెంచుతుంది. అది పాలతో కలిస్తే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి కడుపునొప్పి వస్తుంది. ముల్లంగి కూడా డీహైడ్రేషన్‌కి కారణం అవుతుంది. ఎక్కువగా ముల్లంగిని తీసుకుంటే శరీరంలో అధిక మూత్ర సమస్యకి కారణమవుతుంది. లోబీపి ఉంటే వారు ముల్లంగి తినకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×