E-Paper
Advertisement

Eggs and Milk : గుడ్లు, పాలు ఒకేసారి తీసుకుంటే ఏమవుతుంది?

Eggs and Milk : గుడ్లు, పాలు ఒకేసారి తీసుకుంటే ఏమవుతుంది?
Advertisement

Eggs and Milk : కోడిగుడ్లు, పాలు.. ఇవి రెండింటిలో మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. నిత్యం వీటిని తీసుకోవాలని వైద్యులు కూడాచెబుతుంటారు. పాలు, గుడ్లలో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండు కలిపి ఒకేసారి తీసుకోవచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోకూడదని నిపుణులుచెబుతున్నారు. నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ఆరోగ్యానికి సరిప‌డ‌వు. కొంద‌రికి ఏది తిన్నా పడుతుంది. అయితే ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు త‌మ శ‌రీరానికి స‌రిపోయే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. ఉడికించిన గుడ్లు, పాల‌ను కలిపి తీసుకోవ‌చ్చు. గుడ్ల‌ను తిన్నాక పాలు కూడా తాగ‌వ‌చ్చు. కాక‌పోతే రెండు కలిపి తీసుకుంటే మాత్రం కొందరి గ్యాస్‌ సమస్యలు వస్తాయి, అంతేకాకుండా కడుపు కూడా ఉబ్బరంగా మారుతుంది. అలాంటి సమస్యను గమనిస్తే మాత్రం రెండింటిని కలిపి తీసుకోకుండా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా పాలు, గుడ్ల‌ను రెండింటినీ తిన్నాక కూడా ఎలాంటి స‌మ‌స్య‌లు రాక‌పోతే తీసుకోవచ్చు. ఎలాంటి భ‌యం కూడా అవసరం లేదు. అయితే బాడీ బిల్డింగ్‌, వ్యాయామం చేసేవారు మాత్రం ప‌చ్చి కోడిగుడ్లు, పాలు ఒకేసారి తీసుకుంటారు. అలా చేయ‌డం ఆరోగ్యానకి అంత మంచిది కాద‌ని న్యూట్రిష‌నిస్టులు అంటున్నారు. పచ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అనే బాక్టీరియా అధికంగా ఉంటుంది. అందుకే గుడ్ల‌ను తిన్న‌ప్పుడు ఇన్ఫెక్షన్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప‌చ్చిగుడ్ల‌కు బ‌దులుగా ఉడికించిన గుడ్ల‌ను లేదా గుడ్ల‌ను ఆమ్లెట్ రూపంలో తీసుకోవాలి. దీంతో ఏ సమస్యా ఉండదు. ఆ తర్వాత పాలు కూడా తాగవచ్చు. కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం రెండింటిని కలిపి తీసుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×