E-Paper
Advertisement

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి
Advertisement

Methane leak-triggered explosion in Iran coal mine kills 30: ఇరాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వివరాల ప్రకారం..ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గని టన్నెల్‌లో కార్మికులు పనిచేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ప్రమాదంలో 30 మంది చనిపోయారు. అయితే మీథేన్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అధికారుల వివరాల ప్రకారం.. బొగ్గు గనిలో అర్ధరాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 70 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో 30 మంది మృతిచెందగా.. 17మంది తీవ్రంగగా గాయపడ్డారు. అలాగే గని లోపల మరో 24 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు చేపడుతున్నామని, కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని, ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read:  అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

ఇరాన్‌లో బొగ్గు గనిలో గతంలోనూ చాలా ప్రమాదాలు జరిగాయి. 2009లో జరిగిన ఓ భారీ పేలుడు ప్రమాదంలో 20 మంది కార్మికులు మృతి చెందగా.. 2013లో ఏకంగా రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. ఇక, 2017లో ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఏకంగా 42 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×