E-Paper
Advertisement

New Railway Rule: ఇక ఈ రూట్లో వెళ్లే రైళ్లలో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఐడీ లేకపోతే గెంటేస్తారు జాగ్రత్త!

New Railway Rule: ఇక ఈ రూట్లో వెళ్లే రైళ్లలో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఐడీ లేకపోతే గెంటేస్తారు జాగ్రత్త!
Advertisement

No ID, No Travel: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులలో రైలు ప్రయాణం చేసే ప్యాసింజర్లు టీసీకి కచ్చితంగా గుర్తింపు కార్డును చూపించడం తప్పనిసరి చేసింది. నేపాల్, బంగ్లాదేశ్ సహా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో సర్వీసులు అందించే రైళ్లలో ఈ నిర్ణయం అమలు కానుంది. ఈ  నిర్ణయం భద్రతను మరింత బలోపేతం చేస్తుందని  రైల్వే అధికారులు భావిస్తున్నారు.

ఇండియన్ రైల్వే కొత్త రూల్ ఏంటంటే?   

ఫిబ్రవరి 4, 2026న రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు కీలక లేఖ రాసింది. ఇందులో రిజర్వ్ చేయబడిన తరగతిలో ప్రయాణించేటప్పుడు, కనీసం ఒక ప్రయాణీకుడు గుర్తింపు రుజువును అధికారులకు చూపించాలని ఆదేశించింది. ఒకవేళ వాళ్లు ఐడీ ప్రూఫ్ చూపించకపోతే అందరు ప్రయాణీకులను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా పరిగణించాలని రైల్వే బోర్డు వెల్లడించింది.

Advertisement

రాయితీలు పొందుతున్న, నిర్దిష్ట వర్గాలకు కేటాయించిన కోటాల కింద టిక్కెట్లను బుక్ చేసుకుంటున్న ఏ ప్రయాణీకుడైనా రాయితీ, రిజర్వేషన్ కోటా కోసం వారి క్లెయిమ్ పొందేంతుకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలని జోనల్ రైల్వేలకు సూచించింది. “ఇండో-నేపాల్, ఇండో బంగ్లాదేశ్ సహా పలు అంతర్జాతీయ సరిహద్దులకు సేవలందించే ప్రాంతాలలో కఠినమైన పాటించాలని సంబంధిత వారందరికీ ఈ సూచనలను చేరవేయాలని కోరుకుంటున్నాం” అని రైల్వే బోర్డు ఫిబ్రవరి 6, 2026న జారీ చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది.

Read Also: హైస్పీడ్ రైల్ హబ్ గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ల లింక్ ఇక్కడే!

ప్రయాణ సమయంలో చూపించాల్సిన ఏ ఐడీస్ చూపించవచ్చు అంటే?   

Advertisement

ఇక రిజర్వేషన్ చేసిన రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు కచ్చితంగా ఒక ఒరిజినల్ ఐడీ కార్డును చూపించాలని భారతీయ రైల్వే వెల్లడించింది. అయితే, ఏ కార్డులు చూపించవచ్చు అనే విషయంలో లిస్టును విడుదల చేసింది. అధికారులకు చూపించే డాక్యుమెంట్స్ లో ఉన్న ఐడీ కార్డులు ఇవే..

⦿భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఫోటో గుర్తింపు కార్డు

⦿ ఇండియన్ పాస్‌ పోర్డు

⦿ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు

⦿ RTO జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్

⦿ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీరియల్ నంబర్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డు.

⦿ గుర్తింపు పొందిన స్కూట్, కాలేజీ విద్యార్థుల కోసం జారీ చేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు.

⦿ ఫొటోతో కూడిన నేషనల్ బ్యాంకు పాస్ బుక్.

⦿ ఆధార్ గుర్తింపు కార్డు

Read Also: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!

ఈ డాక్యుమెంట్స్ ఏదైనా ఓ ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రయాణ సమయంలో వీటిలో ఏదైనా ఒకటి చూపించాలి. ఒకవేళ చూపించకపోతే, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారని నిర్ణయించి, కిందికి దింపే అధికారం ఉంటుంది. అదే సమయంలో జరిమానా కూడా విధిస్తారు.

Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రోజుల పాటు ఈ రూట్లలో రైళ్లు క్యాన్సిల్!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×