E-Paper
Advertisement

App Koo : అమెరికాలో ‘కూ’తకు రెడీ!

App Koo : అమెరికాలో ‘కూ’తకు రెడీ!
Advertisement

App Koo : మస్క్ చేతుల్లోకి వెళ్లాక సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తీవ్ర సంక్షోభంలోకి జారుకునే పరిస్థితులు కనిపిస్తుండటంతో… చాలా మంది యూజర్లు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కోసం నెలవారీ ఛార్జీలు చెల్లించడం దండగ అనుకున్న వాళ్లు… మస్క్ విధానాలు నచ్చనివాళ్లు… ఇప్పటికే ఇతర సోషల్ మీడియా యాప్స్ కు షిఫ్టై పోయారు. దాంతో.. డౌన్ లోడ్స్ విపరీతంగా పెరిగిపోయి… ఆయా కంపెనీల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. దాంతో.. అవి సంచలన ప్రకటనలు చేస్తున్నాయి.

5 కోట్ల డౌన్‌లోడ్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే రెండో మైక్రోబ్లాగింగ్ యాప్‌గా అవతరించిన దేశీ యాప్ కూ… అమెరికాలోనూ అడుగుపెట్టాలని డిసైడైంది. మస్క్ టేకోవర్‌ తర్వాత ట్విట్టర్ యూజర్లు తగ్గిపోతున్నారన్న అంచనాల నేపథ్యంలో… దానికి ప్రత్యమ్నాయంగా అమెరికాలో పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది… కూ. అమెరికాలో త్వరలోనే సేవలను ప్రారంభించబోతున్నామని తెలిపాడు… కూ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ. నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం… అమెరికాలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి చెప్పాలని అక్కడి NRIలకు పిలుపునిచ్చాడు… రాధాకృష్ణ.

Advertisement

ఇండియాతో పాటు పలు దేశాల్లో కూ యాప్ మంచి ఆదరణ పొందుతోంది. ట్విట్టర్‌ లాగా తాము ఎలాంటి నెలవారీ ఫీజులు వసూలు చేయమని కూ ఇటీవలే ప్రకటించడంతో… చాలా మంది దాని వైపు మొగ్గుచూపుతున్నారు. 10కిపైగా భాషల్లో అందుబాటులో ఉన్న కూ సేవలు అమెరికాలోనూ మొదలైతే… సంస్థకు ఎదురే ఉండదన్న అంచనాలు ఉన్నాయి. కూ మాత్రమే కాదు… ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా చాలా యాప్ లు అందుబాటులో ఉన్నా… అందులో ఏడెనిమిది మాత్రమే ఎక్కువగా యూజర్ల ఆదరణ పొందుతున్నాయి. వాటిలో మాస్టోడాన్, స్కై, కోహోస్ట్, ట్రైబెల్, టంబ్లర్, కుటుంబ్, క్లబ్ హౌస్ లాంటి యాప్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాస్టోడాన్ యాప్ డౌన్ లోడ్స్ గత మూడు వారాల్లో 5 లక్షలు పెరిగాయి. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ అయిన జాక్ డోర్సేకు చెందిన స్కై యాప్ డౌన్ లోడ్స్ కూడా భారీగా పెరిగాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×