E-Paper
Advertisement

Worlds Largest Economy : 2027 నాటికి ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్

Worlds Largest Economy : 2027 నాటికి ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్
Advertisement

Worlds Largest Economy : ఔను. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని చెబుతోంది… ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ. వచ్చే ఏడేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని… 2027 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. మోర్గాన్ స్టాన్లీ లెక్కల ప్రకారం… భారత జీడీపీ ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి వచ్చే 10 ఏళ్లలో ఏకంగా 8.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇకపై భారత్ జీడీపీకి ఏటా 400 బిలియన్‌ డాలర్ల జత చేయొచ్చని… ఇప్పటివరకు అమెరికా, చైనాలు మాత్రమే అలా చేశాయని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. 2032 కల్లా భారత మార్కెట్‌ విలువ 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.

GST అమలు, కార్పొరేట్‌ పన్నుల్లో కోత, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా భారత్ భారీగా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని… ఈ చర్యలన్నీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను వేగవంత వృద్ధిని సాధించే దేశంగా తయారు చేస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జీడీపీ విషయంలో భారత్, చైనా మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉన్నా… పనిచేసే వయసు ఉన్న జనాభా భారత్‌లో పెరుగుతోంది కాబట్టి దీర్ఘకాల వృద్ధి సాధ్యమవుతుందని… చైనాతో పోలిస్తే భారత పౌరుల సగటు వయసు 11 ఏళ్లు తక్కువ కావడం కూడా కలిసొచ్చే అంశమని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది.

Advertisement

భారత్‌ ఇపుడు మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని… ఆధార్‌ వంటి ప్రజా డిజిటల్‌ మౌలిక వసతుల వల్ల వినియోగదారులు, వ్యాపారుల మధ్య లావాదేవీలు సులభంగానే కాక, సురక్షితంగా సాగుతున్నాయని… ఈ సానుకూలత వల్ల వచ్చే 10 ఏళ్లలో అంతర్జాతీయ వృద్ధిలో 5వ వంతు వృద్ధిని భారత్‌ ఒక్కటే సాధించగలదని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఇతర దేశాల్లో వృద్ధి అంతగా కనిపించని పరిస్థితుల్లో… మల్టీనేషనల్ కంపెనీలకు, అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ ఒక గమ్యస్థానంగా మారుతుందని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×