E-Paper
Advertisement

Bitterness of The Mouth:జ్వ‌రం తగ్గిన తర్వాత నోటి చేదు పోవాలంటే!

Bitterness of The Mouth:జ్వ‌రం తగ్గిన తర్వాత నోటి చేదు పోవాలంటే!
Advertisement

Bitterness of The Mouth:టైఫాయిడ్‌, మ‌లేరియా, డెంగ్యూ లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏది వచ్చినా ఆ వ్యాధి తీవ్రత తగ్గేందుకు కొన్ని రోజులు పడుతుంది. జ్వ‌రం త‌గ్గిన తర్వాత కూడా నోరంతా చేదుగా అనిపిస్తుంటుంది. అందుకు ప‌లురకాల కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు తీసుకునే టాబ్లెట్స్‌ వల్ల నోరు అలా చేదుగా ఉంటుందంటున్నారు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకోసం ఏం చేయాలంటే.. జ్వ‌రం త‌గ్గాక నోటి చేదును పోగొట్టుకునేందుకు పుదీనా ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. 3 నుంచి 4 పుదీనా ఆకులు తీసుకుని బాగా కడిగి నోట్లో వేసుకుని నమిలి మింగేయాలి. దీంతో నోటికి తిరిగి రుచి వస్తుంది. చేదు కూడా పూర్తిగా త‌గ్గుతుంది. అంతేకాకుండా కొత్తి మీర ఆకులను తిన్నా అదే ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి, జీల‌క‌ర్ర‌, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపాయలు, ఉల్లిపాయ ను పచ్చడి చేసుకుని తింటే నోట్లో చేదు తగ్గిపోతుంది. నోటి చేదును పోగొట్టడానికి మిరియాల రసం కూడా బాగా పనిచేస్తుంది. బాగా ఘాటుగాఉండేలా ఈ రసం తయారు చేసుకోవాలి. మిరియాల ర‌సంతో అన్నం తింటే రుచి తెలుస్తుంది. పండు మిర‌ప‌కాయ‌లు, గోంగూర ప‌చ్చ‌ళ్ల‌ను తిన్నా కూడా నోటికి రుచి తెలుస్తుంది. ఆల్‌బుక‌రా కాయ‌లు మనకు రెండు రకాలుగా మార్కెట్‌లో లభిస్తాయి. వీటిని తిన్నా చేదు తగ్గుతుంది. సూప‌ర్ మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ కూడా ఈ ఆల్‌బుకరా పండ్లు మనకు దొరుకుతాయి. వీటిని తిన్నా నోటిలోని చేదు వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒక టీస్పూన్ అల్లం ర‌సంలో సమానంగా తేనె కలిపి ఉదయం పరగడుపునే తీసుకోవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా తింటే నోటి చేదు పోతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×