E-Paper
Advertisement

Ice making on earth : భూమిపై కొత్త రకం ఐస్ తయారీ.. మొదటిసారి.

Ice making on earth : భూమిపై కొత్త రకం ఐస్ తయారీ.. మొదటిసారి.
Advertisement

Ice making on earth : ప్రకృతిసిద్ధంగా పెరిగే ఎన్నో వనరులను కూడా కృతిమంగా తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటివి కృత్రిమంగా తయారు చేసే వీలు ఉంటుందా అని ఆశ్చర్యపోయే క్రియేషన్స్ కూడా శాస్త్రవేత్తలు చేసి చూపించారు. తాజాగా నక్షత్ర మండలంలో దొరికే ఐస్‌ను కూడా వారు కృత్రిమంగా తయారు చేసి చూపించారు. ఇది మరికొన్ని పరిశోధనలకు కూడా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.

కాక్‌టెయిల్ షేకర్ లాంటి పరికరంతో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన ఐస్‌ను తయారు చేశారు. ఇది నక్షత్ర మండలంలో, చంద్రుడిపై దొరికే ఐస్‌లాంటిదని, ఇది నీటిపై చేసే పరిశోధనల్లో వాతావరణ మార్పులను సూచించడానికి ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. బాల్ మిల్లింగ్ అనే ప్రక్రియతో కొంత ఐస్‌ను, స్టీల్ బాల్స్‌తో పాటు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో షేక్ చేస్తే ఈ ఐస్ తయారయ్యిందని వారు బయటపెట్టారు. ఈ ఐస్‌ను అమార్ఫస్ ఐస్ అంటారని వారు తెలిపారు. ఇది చూడడానికి తెల్ల పౌడర్‌లాగా ఉంటుంది.

Advertisement

మామూలుగా ఐస్ క్రిస్టల్‌లాగా రెండు వాటర్ మాలిక్యూల్స్‌తో ఉంటుంది. అందులో రెండు హైడ్రోజన్ ఆటమ్స్, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఒక ప్యాటర్న్‌లో అమర్చబడుంటాయి. కానీ కొత్తగా ఏర్పడిన అమార్ఫస్ ఐస్‌లో మాత్రం వాటర్ అనేది ఒక ప్యాటర్న్‌లో లేకుండా లిక్విడ్‌లాగా విడివిడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మాలిక్యూల్స్ అనేవి ఎప్పుడూ ఒకేరకంగా ఏర్పడవు కాబట్టి ఐస్‌లో కూడా ఎన్నో రకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అంతరిక్షంలో కనిపించే లిక్విడ్.. అమార్ఫస్ ఐసే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు ప్రపంచంలో ఉన్న ఐస్ మొత్తం ఏదో ఒక విధంగా అమార్ఫస్ ఐసే అని వారు చెప్తున్నారు. అమార్ఫస్ ఐస్‌ను తయారు చేయడానికి ఉపయోగపడిన బాల్ మిల్లింగ్ అనే ప్రక్రియ పలు పరిశ్రమల్లో పదార్థాలను గ్రైండ్ చేయడంలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు తయారు చేసిన అమార్ఫస్ ఐస్ భూమిపైన మొదటిది అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి ఐస్‌ను భూమి మీద తయారు చేసినట్టుగా ఆధారాలు లేవన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×