E-Paper
Advertisement

List of Home Sales:ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాదే టాప్

List of Home Sales:ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాదే టాప్
Advertisement

Hyderabad tops the list of home sales: దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే… ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. 2022లో దేశంలోని అన్ని నగరాల కన్నా ఎక్కువగా… హైదరాబాద్‌లోనే ఇళ్లు అమ్మడుపోయాయి. 2021తో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో ఏకంగా 87 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇదే అత్యధిక వృద్ధి రేటు. హైదరాబాద్‌పై అన్ని ప్రాంతాల ప్రజలకూ ఉన్న మక్కువను… ఇళ్ల విక్రయాలే చాటి చెబుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్, వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రియలెస్టేట్ రంగానికి రెక్కలు రావడంతో… 2021లో హైదరాబాద్‌లో 51,500 యూనిట్లు లాంచ్ అయినా… 25,406 ఇళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 2022లో మాత్రం రికార్డు స్థాయిలో 68 వేల యూనిట్లు లాంచ్ అయితే, అందులో 47,487 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 2022లో ఇళ్ల లాంచింగ్‌లో 32 శాతం వృద్ధి నమోదైంది.

Advertisement

2022లో ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ 87 శాతం వృద్ధి సాధించగా… 62 శాతం వృద్ధితో ఆ తర్వాతి స్థానంలో కోల్‌కతా ఉంది. ఢిల్లీ, పుణేల్లో ఇళ్ల విక్రయాలు 59 శాతం చొప్పున వృద్ధి చెందగా, బెంగళూరులో 50 శాతం, ముంబైలో 44 శాతం, చెన్నైలో 29 శాతం వృద్ధి నమోదైంది.

ఇక 2021లో దేశం మొత్తం 2,36,700 ఇళ్లు ప్రారంభం కాగా… 2022లో 51 శాతం వృద్ధితో 3,57,600 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అయితే 2014తో పోలిస్తే మాత్రం 2022లో
లాంచింగ్‌లు తక్కువే. 2014లో దేశంలో ఏకంగా 5.45 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది లాంచింగ్స్‌లో ముంబై, హైదరాబాద్‌ పోటీ పడ్డాయి. అప్పట్లో ఈ రెండు నగరాల వాటానే ఏకంగా 54 శాతంగా నమోదైంది.

Advertisement

2021లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2,36,500 ఇళ్లు అమ్ముడుపోగా, 2022లో 54 శాతం వృద్ధి చెంది… 3,64,900 గృహాలు అమ్ముడయ్యాయి. 2014 తర్వాత మళ్లీ 2022లోనే ఎక్కువగా ఇళ్లు అమ్ముడుపోయాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×