E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. రాబోయే కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. రాబోయే కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 6:45 గంటల సమయానికి అందిన తాజా సమాచారం ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. మరికొద్ది సేపట్లోనే నగరవ్యాప్తంగా వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన!

Advertisement

రాబోయే ఒక గంట కాలంలో ముఖ్యంగా దక్షిణ ,తూర్పు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, చంద్రాయణగుట్ట, సరూర్‌నగర్, ఎల్బీ నగర్, కాటేదాన్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలోని పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రూట్లలో ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

Also Read: అంగరంగ వైభవంగా బోనాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు!

Advertisement

ఉత్తర హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

ఇక ఉత్తర హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే గంటలో కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. పెద్దగా భారీ వర్షం లేకపోయినా, ఎడతెరిపి లేకుండా కురిసే జల్లులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవచ్చని తెలిపారు.

మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు

పైన పేర్కొన్న ప్రాంతాలే కాకుండా హైదరాబాద్‌లోని మిగిలిన ఐటీ కారిడార్ , సెంట్రల్ జోన్ పరిధిలోని ఇతర చోట్ల కూడా రాబోయే గంటలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు చిరుజల్లులు పడే అవకాశం ఉంది. కావున ఆఫీసుల నుండి ఇళ్లకు చేరుకునే వారు, బయటకు వెళ్లే వారు ట్రాఫిక్ ఆంక్షలు , రోడ్లపై నీరు నిలిచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×