E-Paper
Advertisement

Horoscope  Today March 18th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – చేపట్టిన పనుల్లో విజయం

Horoscope  Today March 18th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 18న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

Advertisement

వృషభం: సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మిధునం: ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

Advertisement

కర్కాటకం: వ్యాపార, వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

సింహం : ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

కన్య: వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల: బంధు, మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.

ధనస్సు: కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది నూతన రుణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

మకరం: సమాజంలో ప్రముఖుల నుండి సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం: నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు.

మీనం: చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×