E-Paper
Advertisement

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
Advertisement

Honeymoon Express Movie: ప్రేక్షకులు చూస్తున్నది కేవలం కంటెంట్ గురించే. సినిమా ఎవరు తీశారన్నది ముఖ్యం కాదు.. అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. అందులో కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ తో వచ్చి చాలా సినిమాలు ఫుల్ సక్సెస్ అవుతున్నాయి. ఇదే కోవకు చెందిందే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ. ఈ సినిమా చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. సినిమా సూపర్ ఉందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో తెగ క్రేజ్ ను సంపాదించుకుంది. 40 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో అమెజాన్ ప్రైమ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. హీరోయిన్ – హీరో కెమిస్ట్రీకి మంచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.

Also Read: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Advertisement

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీకి ప్రముఖ డైరెక్టర్ బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతం అందించగా.. ఈ సినిమాలో మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కేకేఆర్, బాలరాజ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు సిస్ల్టా పీఎంకే కెమెరా వర్క్ చేశాడు. ఆయన పనితనానికి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు కూడా ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ వస్తున్నది. కాగా, ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు.

ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ ను కూడా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల ఆధారంగా ఈ సినిమాను అందరూ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీశారు. ఇక ఈ సినిమాకు ఓటీటీలో ఇప్పటికే 40 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఇంకెంతమందిని ఆకట్టుకుని.. ఎన్ని రికార్డులు బ్రేక్ చేయనున్నదో అనేది చూడాలి.

Advertisement

Also Read: ఇప్పటినుండి అన్నా అని పిలుస్తా, ఇది నువ్వు ఫిక్స్ అయిపో.. సైమా స్టేజ్‌పై నాని, విజయ్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×