E-Paper
Advertisement

Saturn Moon : శాటర్న్ మూన్‌లో మానవాళికి కావాల్సిన కెమికల్ గుర్తింపు..

Saturn Moon : శాటర్న్ మూన్‌లో మానవాళికి కావాల్సిన కెమికల్ గుర్తింపు..
Advertisement

Saturn Moon : ప్రస్తుతం భూమిపై కాకుండా మరే ఇతర గ్రహంపై మనుషులు జీవించే ఛాన్స్ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మొదటి టార్గెట్ మార్స్. ఇప్పటికే మార్స్‌లో వాతావరణం ఎలా మారిస్తే మానవాళి జీవించవచ్చు అనే కోణంలో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇతర గ్రహాలపై కూడా శాస్త్రవేత్తలు దృష్టిపెట్టడం మొదలుపెట్టారు. తాజాగా శాటర్న్ మూన్‌లో ఈ అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు.

శాటర్న్‌లోని మూన్స్‌లో ఎంకెలాడస్ ఒకటి. అయితే మానవాళి జీవనానికి కావాల్సినంత ఫాస్ఫరస్ ఈ ఎంకెలాడస్‌లోని సముద్రాల్లో ఉండే ఐస్ క్రిస్టల్స్‌పై ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గమనించారు. దీంతో పాటు ఇక్కడ సముద్ర ప్రాణులు కూడా జీవించగలవని వారు తేల్చారు. ఈ సమాచారం అంతా శాటర్న్‌ను చుట్టి రావడానికి వెళ్లిన మొదటి నాసా స్పేస్‌క్రాఫ్ట్ కాసినీ నుండి శాస్త్రవేత్తలు కలెక్ట్ చేశారు. 2004 నుండి 2017 వరకు ఈ స్పేస్‌క్రాఫ్ట్ శాటర్న్‌ను గమనిస్తూనే ఉంది. ఈ 13 ఏళ్లలో శాటర్న్ గురించి శాస్త్రవేత్తలు తెలియని ఎన్నో వివరాలను ఇది కలెక్ట్ చేసింది.

Advertisement

కాసినీ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఎంకెలాడస్‌లోని ఐస్ గ్రెయిన్స్‌లో ఎన్నో రకాల మినరల్స్, ఆర్గానిక్ వనరులు, అమినో యాసిడ్స్ లాంటివి కూడా ఉన్నాయని తమకు తెలిసిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మానవాళి జీవినానికి ఉపయోగపడే అతిముఖ్య కెమికల్ ఎలిమెంట్స్‌లో ఒకటి అయిన ఫాస్ఫరస్ కూడా ఇప్పుడు ఎంకెలాడస్‌పై కనిపించడం మంచి విషయమని అన్నారు. ఇక ఫాస్ఫరస్‌తో పాటు కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్ కూడా అవసరమని, కానీ అవి ఎంకెలాడస్‌పై లేవని గుర్తుచేసుకున్నారు.

భూమిపైన సముద్రాల్లో కాకుండా ఇతర గ్రహాల్లోని సముద్రాల్లో ఫాస్ఫరస్ అనేది గుర్తించడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాటర్న్‌లోని ఎంకెలాడస్ మూన్‌లో మాత్రమే కాదు మరో మూన్ యూరోపాలో కూడా సముద్రాలు ఉండి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా భూమిపైన ఉన్న ఫాస్ఫరస్‌తో పోలిస్తే ఎంకెలాడస్‌లో 100 రెట్లు ఎక్కువ ఫాస్ఫరస్ ఉన్నట్టు తేలింది. దీంతో ఎంకెలాడస్ అనేది కేవలం మనవాళి జీవనానికి మాత్రమే కాకుండా ఇతర ప్రాణుల జీవనానికి కూడా సపోర్ట్ చేస్తుందని వారు నమ్ముతున్నారు. కానీ ఇంకా దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×